Health Benefits : ఈ ఆకుతో రోగాలన్నీ పరార్.. ఎలా అంటారా..?

Health Benefits : సాధారణంగా మనిషి ఆరోగ్యంగా ఉండడానికి పోషకాహారం కలిగిన ఆహార పదార్థాలు మాత్రమే కాదు పోషక విలువలు కలిగిన ఆకుకూరలు కూడా ఎంతో చక్కగా సహాయపడతాయి. ముఖ్యంగా ప్రకృతిలో లభించే ప్రతి మొక్క .. ఆకు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను కలుగజేస్తాయి. ఇకపోతే ఆకుకూరలు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉండడమే కాకుండా ఎన్నో విటమిన్స్ , మినరల్స్ ను కూడా కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా జుట్టు సంరక్షణ తో పాటు చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతాయి. ముఖ్యంగా ఆకుకూరల్లో కొన్ని రకాల ఆకుకూరలు మరెన్నో పోషకాలను కలిగి ఉంటాయి వీటి వల్ల శరీరానికి కావలసిన అన్ని పోషకాలు లభించడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులను కూడా నయం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆకు కూరలు తినడం వల్ల మనకు కావలసిన అన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.ఇకపోతే ఇప్పుడు ఒక సారి చదివి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.. ఆకుకూరలు అనేవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ముఖ్యంగా అన్ని రకాల ఆకుకూరలు అలాగే బచ్చలికూర లో కూడా అనేక రకాల పోషకాలు ఉంటాయి.

బచ్చలికూర అనేది శరీరానికి కావలసిన శక్తిని అందించడమే కాకుండా ఒక మంచి ఎనర్జీ బూస్టర్ గా కూడా సహాయపడి శరీరాన్ని అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది. ఇక బచ్చలికూర అనేది ఎక్కడైనా సరే సులభంగా పాకే మొక్కలు కాబట్టి ఇంటి పెరట్లో కూడా వీటిని మీరు సులువుగా పెంచుకోవచ్చు. ఇకపోతే బచ్చలి కూర తినడం వల్ల మనకు ఎలాంటి పోషకాలు లభిస్తాయి అనే విషయానికి వస్తే ముందుగా బచ్చలి కూర లో విటమిన్ సి , విటమిన్ ఇ తో పాటు విటమిన్ కె , కాల్షియం, పొటాషియం, సోడియం, జింక్, ఇనుము తో పాటు ఫోలేట్ వంటి ఇతర పోషకాలు కూడా చాలా ఎక్కువగా లభిస్తాయి. బచ్చలి కూర లో ఉండే మరొక ప్రయోజనం ఏమిటంటే కెరటిన్, లూటిన్, జియాక్సంతిన్ తో పాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇక ఇవి శరీరం యొక్క రోగనిరోధక శక్తి ని బాగా పెంచి శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియాను కూడా దూరం చేస్తాయి. ఇక ఎవరైతే అధికబరువుతో బాధపడుతున్నారో అలాంటి వారు తమ డైట్ లో భాగంగా బచ్చలి కూరను చేర్చుకోవడం వల్ల త్వరగా కష్టపడకుండా బరువును తగ్గించుకోవచ్చు.

Health Benefits in Amaranthus dubius
Health Benefits in Amaranthus dubius

ముఖ్యంగా శరీరం లోకి వచ్చే కరోనా లాంటి ఇతర హానికర వైరస్ లను శరీరం నుంచి దూరం చేయడంలో చాలా చక్కగా బచ్చలికూర సహాయపడుతుంది. ఇకపోతే బచ్చలి కూర వల్ల అధిక బరువు తగ్గడమే కాకుండా నీటిలో ఉండే పోషకాలు, శరీరంలో ఉండే చెడు కొవ్వును కరిగించి బరువును నియంత్రణలో ఉంచుతాయి. పొట్ట చుట్టూ ఉండే చెడు కొవ్వును కరిగించి బెల్లీ ఫ్యాట్ ను కూడా తగ్గిస్తుంది. ఇకపోతే బచ్చలికూర లో ఉండే నైట్రేట్లు రక్తప్రసరణను మెరుగు పరుస్తాయి. అధిక రక్తపోటును తగ్గించి గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో బచ్చలి కూర కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడే మహిళల్లో ఎక్కువగా బచ్చలకూర తినడం వలన సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

బచ్చలి కూర తినడం వల్ల శరీరంలో రక్తం ఉత్పత్తి అవుతుంది. ఇకపోతే బచ్చలికూర లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వల్ల మెదడు అలాగే నరాల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. ఇక వయసు పైబడినవారు అధికంగా మతిమరుపు సమస్య తో , కంటి చూపు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. బచ్చలకూర తినడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక మూత్రవిసర్జన సమయంలో మంట , ఇన్ఫెక్షన్ లాంటిది అయిన వారు బచ్చలకూర తినడం వల్ల సమస్యలు తగ్గుతాయి అని వైద్యులు సైతం సలహా ఇస్తున్నారు. ఎముకల పటిష్టతను పెంచి ఆర్థరైటిస్ సమస్యలను దూరం చేస్తుంది. ఇకపోతే పెద్దగా ఖర్చు లేని సులభంగా దొరికే ఈ బచ్చలికూర ఎవరైనా సరే తమ ఆహారంలో ఒక భాగం చేసుకుంటే తప్పకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.