Cancer : వీటిని అధికంగా తింటున్నారా.. క్యాన్సర్ బారిన పడినట్టే..?

Cancer : అత్యంత ప్రాణాంతకమైన వ్యాధులలో క్యాన్సర్ వ్యాధి కూడా ఒకటి. అయితే ఈ కాన్సర్ వ్యాధులలో ఎన్నో రకాలు ఉన్నాయి. కొన్నింటికి చికిత్స లభిస్తే మరికొన్ని క్యాన్సర్ లకు చికిత్స లేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భారత దేశంలో ఇటీవల చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నట్లు ఒక అధ్యయనంలో వెల్లడైంది. క్యాన్సర్ కణాలు శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా ఇవి కణితులు గా ఏర్పడతాయి. ఇక మొదలైన మొదటి దశలో అత్యంత ప్రమాదకరం కాకపోయినప్పటికీ కాలం గడిచేకొద్దీ ప్రాణాంతకంగా మారుతుంది.

జన్యుపరమైనవి అయినప్పటికీ పది శాతం కేసులలో మాత్రమే ఈ లక్షణాలు కనిపిస్తాయి. కుటుంబంలో ఎవరికైనా ఇప్పటికే క్యాన్సర్ ఉంటే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.మద్యపానం, ధూమపానం వంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఇక ఆహార విషయంలో సరైన శ్రద్ధ వహించాలి .తరచుగా రుచిని ప్రోత్సహించే ఆహారాలకు దూరంగా ఉండడమే మంచిది. ఇకపోతే ఇటీవల కాలంలో చాలా మంది కొన్ని రకాల ఆహార పదార్థాలను రుచి కోసం ఎక్కువగా తింటున్నారు . వీటి వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది మరియు ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

Do you eat too much of these Can you get cancer
Do you eat too much of these Can you get cancer

ఉప్పు : ఉప్పు తీసుకోవడం వల్ల కేవలం బీపీ మాత్రమే కాదు క్యాన్సర్ కి కూడా దారితీస్తుంది. ఒక నివేదిక ప్రకారం సాల్ట్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల కడుపు క్యాన్సర్ సమస్య వస్తుందట కాబట్టి సాధ్యమైనంతవరకు తక్కువగా తీసుకోవడమే మంచిది.

గొడ్డు మాంసం : ఈ మధ్యకాలంలో కొంతమంది గొడ్డుమాంసం తినడానికి ఇష్టపడుతున్నారు కానీ పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. అంతే కాదు గొడ్డుమాంసం వారంలో 500 గ్రాములు మాత్రమే తినాలి అని ఇంతకంటే ఎక్కువ తింటే ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుందని ఒక అధ్యయనం వెల్లడించింది.

వేయించిన చేపలు : చేపలలో ఒమేగా త్రి లభిస్తుంది ఇది ఆరోగ్యానికి మంచిదే కానీ బాగా వేయించిన చేపలను తినడం వల్ల దానిలో పోషకాలు పూర్తిగా తగ్గిపోతాయి ఇది క్యాన్సర్ కు దారితీస్తుంది కాబట్టి వేయించిన చేపలను తినడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్ పెరిగిపోతుంది. అంతేకాదు అండాశయం , కాలేయం , రొమ్ము, అన్నవాహిక క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

ఇక ఇప్పటికే క్యాన్సర్ బారినపడి మృతి చెందిన కుటుంబాల వారికి ఇటువంటి ఆర్టికల్ ను వాట్సప్ లేదా ఫేస్బుక్ ద్వారా షేర్ చేసి జన్యుపరమైన క్యాన్సర్ లను నిరోధించవచ్చు.