Health Benefits : తిప్పతీగ ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Health Benefits : పెరట్లో తిప్పతీగ వుంటే తిప్పలు తప్పుతాయని ఒక నానుడి. తిప్పతిగలో ఔషధ వ్యవస్థ దాని యొక్క అనేక వైద్య మరియు ఆరోగ్య ప్రయోజనాల వలన దానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇది శరీరం యొక్క పూర్తి పనితీరును మెరుగుపరుస్తుంది. సంస్కృతంలో అది “అమృత” అని పిలవబడుతుంది అంటే “చావు లేకుండా చేసేది ” అని అర్ధం. ఈ మూలికల యొక్క అద్భుతమైన ప్రభావాలను చూస్తే, తిప్పతీగను నిజంగా అమృతం తో సమానమైనది అని చెప్పవచ్చు. ఎందుకంటే అమృతం దేవతలను ఎల్లపుడు యవ్వనంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది. తిప్పతీగ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది..తిప్పతీగ బెరడు రసంలో 16రకాల ఆల్కలైడ్స్ ఉండడం వల్ల దీన్ని తీసుకుంటువుంటే ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది.ప్లు, జలుబు వంటి జెర్మ్స్ కి యాంటీ ఏజెంట్ గా పనిచేస్తుంది.

డెంగ్యూ కోసం తిప్పతీగ – డెంగ్యూ జ్వరం వచ్చిన వారికి తెల్లరక్త కణాలు తగ్గిపోతువుంటాయి. అలాంటప్పుడు తిప్పతీగ రసమును త్రాగడం వలన తెల్లరక్త కణాల సంఖ్యను పెంచి మరియు అవి సమర్ధవంతంగా పనిచేయడానికి ప్రేరేపిస్తుంది మధుమేహం కోసం తిప్పతీగ – రోజూ తిప్పతీగ పొడిని ఒకలీటర్ నీటిలో మరిగించి త్రాగుతూ ఉంటే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ని క్రమబద్దీకరించి షుగర్ ను కంట్రోలో ఉంచుతుంది. కాలేయం కోసం తిప్పతీగ – ఇది కాలేయ సమస్యలను మంచి ఔషదం అని చెప్పవచ్చు. జ్వరానికి తిప్పతీగ – తిప్పతీగకు వేడిని తగ్గించే గుణం ఉండడం వల్ల ఆకులను కాషాయంగా చేసుకొని బెల్లంతో గాని, తేనెతో కానీ కలిపి తీసుకుంటే జ్వరాన్ని వెంటనే తగ్గిస్తుంది.ఉబ్బస వ్యాధులకు కూడా చెక్ పెడుతుంది. వాతం నొప్పులు.. వాతం వల్ల కలిగే నొప్పులకు తిప్పతీగా బాగా పనిచేస్తుంది.

Do know the Health benefits of tippa teega
Do know the Health benefits of tippa teega

తిప్పతీగ రసానికి, నువ్వుల నూనె కలిపి ఎక్కడ నొప్పీ ఉంటే అక్కడ మర్దన చేస్తే నొప్పులన్నీ మటుమాయం అవుతాయి. తిప్పతీగ యాంటీఆక్సిడెంట్ లక్షణాలు – ఇందులో ఉండే మైక్రోఫేస్ కణాలు వ్యాధులు కలిగించే బాక్టీరియాకి, వైరస్ లకు వ్యతిరేకంగా పోరాడడానికి యాంటీ ఏజెంట్స్ ని ఊత్పత్తి చేస్తుంది. తిప్పతీగ లైంగికశక్తిని పెంచుతుంది -మగవారిలో శుక్ర కణాల ఉత్పత్తిని పెంచి లైంగిక సామర్థ్యాన్ని అధికం చేస్తుంది. కొలెస్ట్రాల్ కోసం తిప్పతీగ – తిప్పతీగ పొడిని ఒక స్ఫూన్ తీసుకోని యాలకులపోడి కలిపి రోజు పరకడప్పున తీసుకుంటే ఎంతటి చెడు కొలెస్ట్రాల్ అయినా ఇట్టే తగ్గాల్సిందే. రుతువిరతి కోసం తిప్పతీగ – ఆడవారికి ఉండే ఋతుక్రమణ బాధలనుండి ఇది కాపాడుతుంది. తిప్పతీగా ఆకులను తీసుకొని అందులో మెంతులుపొడి కలిపి తీసుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గి ఋతుక్రమం క్రమంగా వచ్చేలా చేస్తుంది.