Digestive Problem : ఈ వంటింటి చిట్కా తో తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడం ఖాయం..!!

Digestive Problem : ఇటీవల కాలంలో చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆహారం కొద్దిగా మోతాదులో తీసుకున్నా సరే ఏదో గుండు పెట్టినట్టుగా బరువుగా అనిపించడం , త్వరగా జీర్ణం కాకపోవడం, ఫలితంగా గ్యాస్, ఉబ్బరం, ఏ పని చేయలేక పోవడం లాంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో చాలా మంది బద్దకపు జీవనశైలిని పాటిస్తున్నారు. ఎటూ కదలకుండా రోజంతా ఒకే దగ్గర కూర్చొని ఉంటే అనారోగ్య సమస్యలు కూడా అధికమయ్యే ప్రమాదం ఉంది. ఆలస్యంగా నిద్రించడం, జంక్ఫుడ్ విపరీతంగా తినడం లాంటివి చేయడం వలన ఎక్కువగా ఛాతీలో మంట , మలబద్దకం , కడుపునొప్పి, ఎసిడిటీ వంటి జీర్ణసంబంధ సమస్యలు ఎదురవుతున్నాయి.

అనారోగ్యకరమైన అలవాట్లు వల్ల కూడా తిన్న ఆహారం విషయం గా మారే అవకాశం కూడా ఉంది. శరీరంలో టాక్సిన్లు పేరుకుపోయే అవకాశం ఉంటుందట. అలాంటప్పుడు ఇది జీవక్రియ తో పాటు మొత్తం ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది అని ఆయుర్వేద వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే మన జీవన శైలిలో మార్పులు తీసుకురావాలి. తినే ఆహారం పోషకాహారం తో కూడి ఉండడం, సరైన వ్యాయామం ప్రతిరోజు నడక లాంటివి చేయడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.ఇక ఎలాంటి వంటింటి చిట్కాలను పాటించాలి అనే విషయానికి వస్తే.. భోజనం చేసిన తరువాత కొంచెం జీలకర్ర తీసుకోవడం వల్ల ఎసిడిటీ , గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం అవుతాయి.

Digestive problem Tips in Anise seeds
Digestive problem Tips in Anise seeds

ప్రతి రోజు కూడా సమయానికి ఆహారం తీసుకోవడం తప్పనిసరి . అలాగే ఒత్తిడి లేకుండా చూసుకోవడం, సమయానికి నిద్ర పోవడం లాంటివి చేయడం వల్ల కొంత వరకు ఉపశమనం పొందవచ్చు. ప్రతిరోజు ఒక యాపిల్ ను తీసుకోవాలి. ఎందుకంటే యాపిల్ లో లభించే పెక్టిన్ జీర్ణసమస్యలు రాకుండా కాపాడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం మంచిది. అలాగే తిన్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజలు తీసుకున్నా.. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. ఇటీవల కాలంలో బిజీ లైఫ్లో గడిపే ప్రతి ఒక్కరికి ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి అందరికీ ఈ ఆర్టికల్ను వాట్సాప్ ద్వారా షేర్ చేయండి.