Ganesha Marriage : ఆయన ఆదేశం వల్లే గణేషుడి వివాహం జరిగిందా.. మరి ఎంత మంది భార్యలు అంటే..?

Ganesha Marriage : హిందూ సాంప్రదాయం ప్రకారం సనాతన ధర్మాలు మనిషికి ప్రతి ఒక్కటి నేర్పిస్తాయి అన్న విషయం తెలిసిందే. ఇక వీటి వల్ల మనిషి సన్మార్గంలో నడుస్తాడు అని , నలుగురికి సహాయపడతాడు అని హిందూ సాంప్రదాయాలు చెబుతున్నాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం భారతీయులు వినాయకుడిని ఆదిదేవుడు గా పరిగణిస్తారు.  అంతేకాదు ఏ శుభకార్యాన్ని ప్రారంభించాలన్నా సరే ముందుగా వినాయకుడికి పూజలు చేసిన తర్వాత మిగతా దేవుళ్లకు పూజలు చేయడం ఆనవాయితి. విఘ్నాలను తొలగించే వినాయకుడిగా,  శుభాలు కలిగించే గణేషుడి గా , ప్రజలకు నష్ట , ప్రాణ భయాలను తొలగించే  సిద్ధి వినాయకుడిగా ప్రతీతి.

ఇదిలా ఉండగా వినాయకుడు అంటే ప్రతి ఒక్కరికి బొజ్జ గణపయ్య అని,  పరమశివుడి తనయుడు అని,  పార్వతీదేవి చేసిన ప్రతిమ ద్వారా ఆవిర్భవించాడు అని ఇలా రకరకాలుగా చెప్పుకుంటారు. కానీ ఆయన వివాహం ఎవరితో జరిగింది.. ? ఆయనకు భార్యలు ఎంతమంది ..? అనే విషయం మాత్రం బహుశా చాలా కొంతమందికి మాత్రమే తెలుసు అని చెప్పవచ్చు. ఈ రోజు మనం ఈ ఆర్టికల్ ద్వారా వినాయకుడి యొక్క వ్యక్తిగత విషయాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక తెలుసుకోవడానికి ముందు ఈ ఆర్టికల్ ను ప్రతి ఒక్కరికి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి.కొన్ని పురాణాలు ఏమని చెబుతున్నాయంటే వినాయకుడు పెళ్లి చేసుకోలేదని,  బ్రహ్మచారిగానే ఉన్నాడని అంతేకాదు బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడు అని కూడా చెబుతున్నాయి .

Did Ganesha get married by his order and how many wives
Did Ganesha get married by his order and how many wives

కానీ మరి కొన్ని పురాణాలు ఏమి చెబుతున్నాయి అంటే.. ఒకరు కాదు ఏకంగా ఇద్దరు మహిళల తో వివాహం జరిగింది అని చెబుతున్నాయి. దైవిక యోగం ద్వారా ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. వారి పేర్లు రిద్ధి మరియు సిద్ధి. ఈ సందర్భంగా వీరిద్దరిని వినాయకుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారు..?  అందుకు గల కారణాలు ఏమిటి..?  అనే విషయానికి వస్తే.. పురాణాల ప్రకారం వినాయకుడు ఒక ప్రశాంతమైన వాతావరణంలో తపస్సు చేస్తూ ఉన్నప్పుడు.. అటుగా వెళ్తున్న తులసి గణేషుడిని చూసి ఆకర్షితురాలవుతుంది.  అంతేకాదు ఆయనను  వివాహం చేసుకోవాలని కూడా కోరుకుంటుంది. కానీ ఆమె తో బ్రహ్మచారిని అని చెప్పి వినాయకుడు తన వివాహ ప్రతిపాదనను తిరస్కరించాడు.తన తో పెళ్లి విషయాన్ని తిరస్కరించిన వినాయకుడి పై తులసి కోపంతో శాపం విధించింది. ఒకటి కాదు ఏకంగా రెండు పెళ్లిళ్లు చేసుకోవాలని శపించింది.

వినాయకుడు కూడా అసురుడి తో నీ పెళ్లి జరుగుతుంది అని తులసి కి శాపం పెడతాడు. అలా వినాయకుడి పూజలో తులసి వాడకూడదు అని పండితులు చెబుతారు.. మరొక పురాణం ప్రకారం తన పెళ్లి జరగకపోతే ఇంకా ఎవరికీ వివాహం జరగకూడదని వినాయకుడు భావించాడు. ఇందుకు వినాయకుడికి ఎలుక మద్దతు కూడా లభించింది. వినాయకుడు చేసిన ఈ వాగ్దానం వల్ల దేవతలు అందరూ భయపడి పోయి,  తమ కష్టాలు తీర్చమని బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్తారు. అప్పుడు బ్రహ్మ యోగం నుండి రిద్ధి , సిద్ధి అనే ఇద్దరు కుమార్తెలు జన్మిస్తారు. వారిద్దరూ బ్రహ్మదేవుని మానసపుత్రికలు.దేవుడు వీరిద్దరికీ బోధనలను నేర్పించమని వినాయకుడికి చెబుతాడు.

బ్రహ్మదేవుని ఆదేశాల మేరకు వినాయకుడు వారికి బోధనలు నేర్పడం ప్రారంభించాడు. వినాయకుడి దగ్గర పెళ్లికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు వారిద్దరూ తమ దృష్టిని మరల్చే వారు. ఆ తర్వాత అందరూ పెళ్లి చేసుకోవడం ప్రారంభించారు అన్న  విషయం తెలుసుకున్న వినాయకుడు సిద్ది, రిద్ది పై శపించడం మొదలు పెడతాడు. ఇక వెంటనే బ్రహ్మదేవుడు వినాయకుడిని అడ్డుకొని .. వారిద్దరిని వివాహం చేసుకోవాలని  ఆదేశిస్తాడు. ఇక అలా బ్రాహ్మ ఆదేశానుకునుంగా అంగరంగ వైభవంగా వీరిద్దరి వివాహం చేసుకుంటాడు వినాయకుడు. ఇక వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు వారి పేర్లు శుభ్, లాభ్..