Beauty Tips : మెరిసే చర్మం కోసం ఈ చిట్కా తప్పనిసరి..!!

Beauty Tips : చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పుడే చర్మానికి కావలసిన అందం కూడా లభిస్తుంది. ఇప్పుడు అందంగా కనిపించాలంటే.. చర్మానికి కూడా తగిన జాగ్రత్తలు పాటించినప్పుడే చర్మం అందంగా, తాజాగా ఉంటుంది. ఇక వాతావరణం మారుతున్న కొద్దీ మన చర్మ సంరక్షణ కూడా మనం పాటించాలి. లేకపోతే చర్మం నిర్జీవంగా మారడమే కాదు చర్మం పై అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా చర్మ సంరక్షణ విషయంలో మార్కెట్లో దొరికే ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించకపోవడం మంచిది. ఎందుకంటే వీటిలో కెమికల్ కాంపౌండ్స్ ఎక్కువగా వాడడం వల్ల చర్మానికి సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చర్మం కాంతి విహీనంగా అనిపిస్తున్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలు పాటించండి.

పసుపు – కుంకుమ పువ్వు : పసుపు చర్మాన్ని పునరుద్ధరించడానికి సహాయపడితే కుంకుమపువ్వు చర్మంపై పేరుకున్న మురికిని తొలగించడమే కాకుండా రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. కుంకుమపువ్వు , పసుపు పాలల్లో కలిపి ముఖానికి పట్టించి 20నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు పాటించినట్లయితే చర్మం అందంగా మారడమే కాకుండా కాంతివంతంగా ఆరోగ్యంగా తయారవుతుంది.

Beauty Tips for Shiny Skin Yellow saffron flower
Beauty Tips for Shiny Skin Yellow saffron flower

నిమ్మరసం – తేనె : నిమ్మరసంలో విటమిన్ సి లభిస్తుంది. కాబట్టి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి.. చర్మంపై పేరుకుపోయిన మలినాలను దూరంచేసి.. ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. తేనె సహజంగా చర్మానికి కాంతిని అందించడంలో సహాయపడుతుంది. ఇక నిమ్మరసం , తేనె రెండింటినీ కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన మలినాలు కూడా దూరమవుతాయి. చర్మం తాజాగా, తెల్లగా నిగారింపుగా ఉంటుంది.

అరటిపండు : ప్రతిరోజు నిద్రించేముందు అరటి పండు తొక్క ను ముఖంపై రుద్దడం వల్ల చర్మం పై ఉన్న నల్లటి మచ్చలు, ముడతలు కూడా దూరమవుతాయి. రాత్రి సమయంలో అరటి తొక్కతో ముఖాన్ని రుద్ది.. ఉదయమే చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కొన్ని జాగ్రత్తలు తరచూ పాటిస్తున్నట్లు అయితే చర్మం మీద పేరుకుపోయిన మురికి , దుమ్ము , ధూళి తొలగిపోవడమే కాకుండా మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.