Lakshmi Devi : లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే.. మీ వంటింట్లో ఈ వస్తువులు ఉండాల్సిందే..!!

Lakshmi Devi : మన జీవితం పైన వాస్తు ప్రభావం ఉంటుందని వాస్తు శాస్త్రం పదేపదే చెబుతున్న ఇటీవల కాలంలో చాలామంది పట్టించుకోవడం లేదు. పైగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గృహ నిర్మాణంలో కూడా వాస్తు దోషాలు ఉంటే ఖచ్చితంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మించేటప్పుడు వంటగదిలో ప్రత్యేకంగా ఉండాల్సిన వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలు పాటించాలి. అలా వాస్తు శాస్త్రాన్ని మనం పాటించినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి తాండవం ఆడుతుందట.మీ వంటగది గనుక వాస్తుదోషంగా ఉన్నట్లయితే..

ఆ స్థలంలో నివసించేవారు అభివృద్ధి చెందక పోగా ఆర్థిక నష్టం ఏర్పడుతుంది. అంతేకాదు అలాంటి ప్రదేశంలో లక్ష్మీదేవి నిలబడదు. ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన వస్తువులు ఏమిటి అనే విషయానికి వస్తే.. ఉప్పు.. ఉప్పు ఆహారపు రుచిని పెంచడమే కాకుండా మరొక వైపు వాస్తు శాస్త్రాన్ని కూడా సరిచేస్తుంది. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను కూడా తొలగిస్తుంది. ముఖ్యంగా వాస్తు దోషాలతో పాటు రాహుకేతువుల ప్రభావం కూడా తొలగిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అయిపోయే వరకు ఉండకుండా ముందే తెచ్చి పెట్టుకోవడం తప్పనిసరి.హిందూమతంలో పసుపుకు చాలా ప్రాముఖ్యత ఉంది.

If Lakshmi devi wants to be at home
If Lakshmi devi wants to be at home

ఇక జీవితాన్ని ఆనందమయం చేయడానికి వాస్తు శాస్త్రంలో పసుపుకు కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక విశ్వాసాల ప్రకారం గురుగ్రహానికి పసుపు కు సంబంధించి అవినాభావ సంబంధం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇంట్లో పసుపు అయిపోతే గురుగ్రహం యొక్క దోషం ఏర్పడుతుంది. దానివల్ల మీ పనులకు ఆటంకం కలగడమే కాదు.. ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. ఇంట్లో బియ్యం అయిపోయే వరకు కూడా అస్సలు ఉండకూడదు . ఇక గోధుమపిండి కూడా నిల్వ ఉండే లాగా చూసుకోవాలి. ఇక ఈ ఐదు పదార్థాలు ఎప్పుడూ మీ వంటగదిలో ఉండేలాగా చూసుకోవాలి. లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవుతాయి. ఇక ఇలాంటి సమాచారాన్ని అందరికీ అందించాలి కాబట్టి ఈ ఆర్టికల్ ను వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.