Beauty Tips : మచ్చలు లేని ముఖం కావాలంటే..?

Beauty Tips : మచ్చలు లేని ముఖం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ముఖం ఎంత అందంగా.. తెల్లగా ఉన్నప్పటికీ ముఖం మీద నల్లటి మచ్చలు ఉంటే మాత్రం అందవిహీనంగా కనిపిస్తారు. నల్లటి మచ్చలు అనేవి కొంతమందికి పుట్టుకతో వస్తే మరికొంతమందికి ఎండ తాకిడి వల్ల చర్మం నల్లగా మారి అక్కడ ఆ భాగం పూర్తిగా మచ్చ రూపంలోకి మారుతుంది. కొంతమందికి మొటిమల తాలూకు మచ్చలు కూడా ఏర్పడతాయి.ఇలాంటి మచ్చల వల్ల చూడడానికి అందవిహీనంగా.. అసహ్యంగా కనిపిస్తారు.ఇక ఎక్కువగా ఎండలో తిరిగినప్పుడు ముఖంపై ట్యాన్ ఏర్పడడం, ముఖాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకోని సమయంలో కూడా ముఖం జిడ్డుగా మరి ఇలా నల్లగా మారుతుంది.

అంతేకాదు సమయానికి నిద్ర పోకపోవడం వల్ల కూడా కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. మరి ఇలాంటి సమయంలో ముఖాన్ని అందంగా మార్చుకోవాలన్నా ఎలాంటి చిట్కాలు పాటించాలి అనే విషయం ఒకసారి తెలుసుకుందాం.. మీ ఇంట్లో అక్క, అమ్మ, చెల్లి, అత్త , వదిన ఇలా ఎవరైనా సరే మచ్చలు లేని ముఖం కోసం ఎదురుచూస్తున్నట్లు అయితే వారికి ఈ ఆర్టికల్ వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.మచ్చలను తొలగించే అద్భుతమైన చిట్కా ఏమిటంటే బంగాళాదుంప రసం.. బియ్యం నీళ్లు.. బంగాళదుంపలను చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేయాలి.

Beauty Tips a spotless face Potato juice
Beauty Tips a spotless face Potato juice

ఇప్పుడు మెత్తటి పేస్టులాగా చేసిన తర్వాత ఈ మిశ్రమం నుంచి రసాన్ని బయటకు తీయాలి.. ఇప్పుడు మరొక బౌల్లో బియ్యం ఒక గ్లాసు వేసి , అందులో రెండు గ్లాసుల నీరు పోయాలి. ఇక ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత మరొక గ్లాసు నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని వడగట్టుకుని బంగాళాదుంప రసంలో కలిపి.. డీప్ ఫ్రిజ్లో లో ఐస్ క్యూబ్ ట్రేలో పోసి ఒక రోజంతా వదిలేయాలి.ఇక రోజుకు ఒకటి చొప్పున ఐస్ క్యూబ్ తో ముఖాన్ని మసాజ్ చేస్తూ . పది నిమిషాలు వదిలేసి.. తర్వాత శుభ్రం చేసుకుంటూ ఉన్నట్లయితే కేవలం నెల రోజుల్లోనే అందమైన ముఖం మీ సొంతం అవుతుంది. ఖర్చులేకుండా నిగనిగలాడే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.