Arvind gosh: చరిత్ర నిజాలు: మనిషి జీవితం లో ఆధ్యాత్మికత యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పిన అరబింద్ గోష్ !!

Arvind gosh: మహాయోగి శ్రీ అరబిందో:
మనిషి జీవితం లో ఆధ్యాత్మికత ఎంత గొప్ప పాత్ర పోషిస్తుందో దాని గొప్పతనం తను అనుభవించి ఇతరులకు తెలియచెప్పిన మహాయోగి శ్రీ అరబిందో,


Arvind gosh: ఆధ్యాత్మిక భావాలతో:

ఏ కార్యమైనా అది కేవలం ఈశ్వరేచ్ఛతోనే జరుగునని ఈశ్వరానుగ్రహం సంపాదించడమే ప్రతి మనిషి జీవిత ధ్యేయంగా పెట్టుకోవాలని చాటిన గొప్ప మహనీయుడు శ్రీ అరబిందో. జీవితాన్ని మాములుగా జీవించింది వేరు ఆధ్యాత్మిక భావాలతో కలిపి జీవించడం వేరు అని చాటి చెప్పారు. ఆధ్యాత్మిక శక్తి ఉన్నవారు జీవితం ఎంత విజయవంతం గా ఉంటుందో తెలియచేసిన మహానుభావుడు.

యోగశక్తిని ప్రపంచానికి తెలియచేసి:

తన అనుభవాలను పుస్తకరూపంలో పెట్టి సావిత్రి లాంటి రచనలు చేసి, తన జ్ఞానాన్ని, తన ఆలోచనలను, యోగశక్తిని ప్రపంచానికి తెలియచేసి జ్ఞానవేత్త శ్రీ అరబిందో గారు.
జీవితంలో ఉన్నత లక్ష్యాలు కలిగి ఉండి ఆ లక్ష్యం కోసం నిరంతరంశ్రమించిన శ్రీ అరవిందుల వారి జీవితం ఎందరికో స్ఫూర్తి నిస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.


శ్రీ అరవిందుల వారి జీవితం:

మనిషి తన జీవితంలో ఎలాంటి మార్గంలో వెళ్ళాలో, ఏ లక్ష్యం ఎంచుకుని సాధించాలో, ఏ మార్గంలో ప్రయాణించాలో తెలుసుకోవాడానికి శ్రీ అరవిందుల వారి జీవితం మనకు బాగా ఉపయోగపడుతుంది.
గమ్యాన్ని చేరుకోవటం కోసం పాటించిన నియమాలు, ఎదురైనా చేదు అనుభవాలు, కష్టాలు వాటిని తట్టుకోవడంలో ఈశ్వరానుగ్రహం కోసం చేసిన ప్రయత్నాలు శ్రీ అరవిందుల వారి జీవితంలో మనకి తెలుస్తాయి.

అరబిందో బాల్యం :

అరబిందో 1872 వ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన,కలకత్తాలో పుట్టారు. ఈయన పూర్తి పేరు అరబిందో ఘోష్. అరవింద అనగా బెంగాలీలో పద్మము అని అర్థం వస్తుంది. తల్లి స్వర్ణ లతా దేవి, తండ్రి కె. డి. ఘోష్. అయన ఒక వైద్యుడు. ఈయన బ్రిటన్ లో ఉండి అబెర్దీన్ విశ్వవిద్యాలయంలో వైద్య విద్య ను పూర్తి చేసారు.
అరవిందుల మాతామహులు:
అరవిందుల మాతామహులు(తల్లిగారి తండ్రి) సుప్రసిద్ధ బ్రహ్మ సామాజికులయిన రాజనారాయణబోసు గారు. వీరు సంస్కృతం,ఆంగ్ల భాషలలో మహావిద్వాంసులు. వీరి కుమార్తె శ్రీమతి స్వర్ణలతాదేవి అరవిందుల తల్లి గారు. అరవిందుల తండ్రి గారి పూర్వులు బ్రహ్మ సమాజ విరోధులు గా ఉండేవారు. కానీ వారి తండ్రి గారు మాత్రం బ్రహ్మసమాజంపట్ల అభిమానం గా ఉండేవారు. అందుకే అరబిందో తండ్రి గారు బ్రహ్మసమాజ కన్య అయిన స్వర్ణలతాదేవి ని వివాహం చేసుకోవడం జరిగింది. వీరి వివాహానికి మహర్షి దేవేంద్రనాధ్ ఠాకూర్ గారు స్వయంగా పౌరోహిత్యం చేశారట.

అరబిందో తోబుట్టువులు:

స్వర్ణ లతా దేవి, కృష్ణధనఘోషు దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉండేవారు. వీరి మొదటి కుమారుని పేరు వినయభూషణుడు, రెండవ కుమారుని పేరు మనోమోహనుడు, మూడవ కుమారుడి పేరు అరవిందులు, నాల్గొవ సంతానం సరోజినిదేవి, చివరి కుమారుడు వారీంద్రుడు. ఈ వారీంద్రుడు వంగదేశంలో ప్రఖ్యాత విప్లవకారుడు గా చెప్పబడ్డారు. సరోజినీదేవి మాత్రం ఆజన్మ బ్రహ్మ చారిణి గా ఉండి , ఆధ్యాత్మిక అన్వేషణా పరురాలుగా పేరుపొందింది.

చిన్నతనంలోనే డార్జిలింగు:

కృష్ణధనఘోషుకు ఆంగ్ల విద్యమీద చాల అభిమానం ఉన్న కారణం గా, బాగా చిన్నతనంలోనే అరవిందుని డార్జిలింగు పంపించి అక్కడ సెయింట్ పాల్ స్కూల్ లో చదివించడం జరిగింది. దానితో కూడా ఆయన తృప్తి పడలేక ఇంగ్లండు కి వెళ్లారు. అక్కడే వీరి చిన్న కుమారుడు వారేంద్రుడు జన్మించడం జరిగింది. కాని అక్కడ వీరి కుమార్తె సరోజినీదేవి ఉన్మాదవ్యాధితో బాధపడుతుండడం వల్ల ఇక అక్కడనుండి భారతదేశం కి తిరిగి వచ్చేసారు.

అరబింద్ చదువు :

అరవిందులు 7 సంవత్సరాలు ఇంగ్లాండులో తరువాత 5 సంవత్సరాలు మాంచెస్టరులో చదువు ను కొనసాగించారు. ఈయన తన 18వ ఏటనే ఇ.పి.యస్ పరీక్షకు హాజరై గ్రీక్, లాటిన్ భాషలలో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులయినారు.

వందేమాతరం పత్రికాసంపాదకత్వం:

కాలేజీ లో లెక్చరర్ ఉద్జోగంవిడిచి తరువాత అరవిందులు వందేమాతరం పత్రికాసంపాదకత్వంమొదలు పెట్టారు. అంతకుముందు వారపత్రికగా ప్రచురింపబడుతున్న ఈ ఆంగ్లపత్రిక అరవిందుల సంపాదకత్వంలో దినపత్రిక గా మారింది. ఈ పత్రిక మూలంగా జాతీయతత్వం అనేది వంగదేశాన్ని ఉర్రూతలూగించింది అనే చెప్పాలి. ఆ తర్వాత వీరి జాతీయ సందేశం భారతదేశం అంతటా వ్యాపించడం జరిగింది. ఈ సమయంలోనే ఆంగ్లప్రభుత్వం వీరికి రాజద్రోహ నేరంమీద శిక్ష వేయాలని చూసింది.అయితే నేరం ఋజువు కాకపోవడంవల్ల ప్రభుత్వం వీరిని ఏమీచెయ్యలేకపోయింది.

సూరత్ కాంగ్రెస్ జాతీయపక్షనేత గా:

అరవింద్ ఈ సమయంలోనే 1907 వ సంవత్సరం డిసెంబరులో జరిగిన సూరత్ కాంగ్రెస్ జాతీయపక్షనేత గా హాజరవడం జరిగింది. ఆ సమయం లో అక్కడ మితవాదులకు, జాతీయపక్ష నాయకులైన అరవింద్ లకు మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. జాతీయపక్షనేతలందరు అరవిందుల నాయకత్వం లో కలసి వేరుగా ఒక సమావేశం పెట్టుకుని దేశాభివృద్ధికరమైన మార్గం నిర్దేశించారు. దీని తర్వాత వీరిపై ఆలీపూరు బాంబుకేసు నడిచింది. అరవిందుల యొక్క కనిష్ఠసోదరుడు వారీంద్రుడు విప్లవకారుడు కావడం వలన వీరిపై ప్రభుత్వం అపోహలు మోపారు. ఈ కారణం గా అరవిందులు జైలులోచాలా కష్టాలుఅనుభవించవలిసి వచ్చింది. ఈ ఆలీపూరు కేసులో చిత్తరంజన్ దాస్ వీరికి న్యాయవాదిగా ఉండడం జరిగింది.

తండ్రిగారి మరణం :
అరవింద్ 1893 వ సంవత్సరం వరకు ఆంగ్లదేశంలోనేఉండిపోవడం జరిగింది. అరవిందుల 20వఏట తండ్రిగారు మరణించడంతో భారతదేశం కి తిరిగి వచ్చి బరోడా మహారాజు పరిచయంతో అక్కడ ఆయనకు ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలం పాటు రెవెన్యూ శాఖలో పనిచేసి, చివరికి బరోడా ఆంగ్లకళాశాలలో ఉపాధ్యక్షులుగా చేరారు. అరవిందో 13 సంవత్సరాలపాటు ఈ ఉద్యోగం లో ఉన్నారు. ఈ సమయంలోనే గుజరాతీ, హిందీ, సంస్కృతం, బెంగాలీ మొదలయిన భాషలలో అఖండమైన పాండిత్యం సంపాదించుకున్నారు.

అరబింద్ వివాహ జీవితం :
అరవిందులు బరోడాలో ఉన్న సమయం లోనే మృణాలినీదేవిని వివాహం చేసుకోవడం జరిగింది. అప్పటికి అరవిందుల వయస్సు 28 సంవత్సరాలు. గృహస్థాశ్రమంలో ఉన్న కొద్దీ కాలం లో నే ఆయన తన భార్యను దేశభక్తురాలిగా, ఆధ్యాత్మిక చింతా పరాయణురాలి గా తీర్చిదిద్దుకోవడం జరిగింది.శ్రీ అరవిందులు వారు , మృణాలినీదేవి గారికి వ్రాసిన లేఖల ఆధారం తా అప్పటికే వారిలో తీవ్రంగా మొదలైన ఆదర్శ ప్రభావం కనిపిస్తుంది. బరోడాలో ఉన్నప్పుడు అరవిందుల వారికి ఆధ్యాత్మిక జిజ్ఞాస ఎక్కువగా ఉండేది. ఆ సమయం లోనే , నర్మదా నదీ తీరంలో ఉన్న బ్రహ్మానందస్వామి, సుప్రసిద్ధ విష్ణుభాస్కర స్వామి సాంగత్యందొరికింది.ఆ తరువాత అరవింద్ రాజకీయాలలో ప్రవేశించినా కూడా లోలోపల ఉన్న ఆధ్యాత్మిక తృష్ణ మాత్రం అణిగిపోలేదు.

జాతీయ కళాశాలగా :
వంగదేశ విభజన వల్ల, వందేమాతరం ఉద్యమం వల్ల ఆరోజుల్లో అప్పుడే ప్రారంభమైన పాశ్చాత్యుల జాతీయ కళాశాలకు అరవిందులు ప్రధానోపాధ్యాయులుగా నెలకు 25 రూపాయల జీతానికి చేరారు. ఈకళాశాల ప్రభుత్వ సంబంధం లేని పరిపుర్ణమైన జాతీయ కళాశాలగా ఉండాలని అరబింద్ అభిప్రాయ పడ్డారు. ఆయన అభిప్రాయాన్ని కళాశాల వ్యవస్థాపకులు వ్యతిరేకించడంతో ఆ ఉద్యోగంనుంచి అరవిందులు బయటకు వచ్చేసారు.

రాజకీయం నుంచి ఆధ్యాత్మికత వైపు:
అరబిందో రాజకీయం నుంచి ఆధ్యాత్మికత వైపుకు నిమ్మనెమ్మదిగా మారడం జరిగింది. ముందుగా వడోదరలో మహారాష్ట్ర యోగియైన విష్ణు భాస్కర్ లెలే ఉపదేశంతో ఆధ్యాత్మికత వైపుకు మొగ్గు చూపారు. రెండవసారి కోల్‌కతాలోని ఆలీపూర్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నరోజుల్లో ఆధ్యాత్మికత పట్ల గాఢమైన ఆసక్తి కలగడం అనేది జరిగింది. ఇక్కడ ఆయన చేసిన భగవద్గీత పారాయణం, అనుసరణ వలన ఆయన అనేక ఆధ్యాత్మిక అనుభూతుల్ని పొందగలిగారు.

ఆయన ప్రభావం :
ఆయన ప్రభావం నాలుగు దిక్కులా వ్యాప్తమైనది. భారతదేశంలో ఎస్.కె మైత్ర, అనిల్బరన్ రోయ్, డి.పి.చటోపాధ్యాయ వంటివారు అరవిందుల సాహిత్యాన్ని గురించి వ్యాఖ్యానించడం కూడా జరిగింది.
తాత్విక , ఆధ్యాత్మిక రచనలు పుదుచ్చేరిలో నాలుగేళ్ళు ఏకాగ్రతతో యోగాను పాటించి ఆ తర్వాత 1914 వ సంవత్సరంలో ఆర్య అనే అరవై నాలుగు పేజీల సమీక్షను మాసపత్రిక రూపంలో తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆరున్నరేళ్ళ పాటు ఆయన ఈ పత్రిక ద్వారానే తన ముఖ్యమైన ధారావాహికంగా రచనలను ప్రజలకు అందించేవాడు.


ప్రపంచంతో సంబంధంలేని యోగి కాదు :
అరవిందులు ఏకాంతంగా ఎవరికీ ,ఎక్కడ కనబడకుండా ముక్కు మూసుకొని కూర్చొనే ప్రపంచంతో సంబంధంలేని యోగి అని సామాన్యదృష్టికి అనిపించవచ్చు. కాని కాస్త నిశితంగా వీరి ఆధ్యాత్మిక దృక్పధము, దర్శన తత్వము పరిశీలిస్తే ఇది ఎంతమాత్రము నిజం కాదని తెలుస్తుంది. ప్రస్తుతజీవితం లో ఉన్న దుఃఖాలలో నుంచి తప్పించుకొని పరబ్రహ్మలో విలీనమైపోవడం వీరి ఆదర్శం ఏమాత్రం కాదు. ఈ విషయంలో వీరికీ శంకరభగవత్పాదులచే ప్రవర్తితమైన అద్వైతానికీ చాలా భేదాలు కనిపించాయి.

అరవిందుల ప్రతి పాదాన :
అరవిందుల దర్శనంలో మాయా యొక్క ప్రమేయమే లేదు. అద్వైతవాదంలో బ్రహ్మపై జగత్తు అధ్యాసితమై వివర్తంగా కనబడుతుంది. అరవిందులు అద్వైతులు ప్రతిపాదించే నిర్గుణ పరబ్రహ్మ ఆధ్యాత్మికాన్వేషకుని సాధనలో ఒకమెట్టు మాత్రమే అనీ, దీనికి పైన అతిమానసిక భూమికలు క్రమక్రమంగా అనేకం ఉన్నాయని, అన్నింటికి పైన విజ్ఞాన భూమిక ఉన్నదనీ తెలియచేసారు. ఆ భూమికల కన్నింటికీ దిగువ సబ్ కాన్షియాస్ చెప్పే అవ్యక్త మనస్సు కూడా ఉన్నదని అంగీకరిస్తారు. ఈ రెండు భూమికలకు మధ్యన ఇంకా అనేకమైన భూమికలున్నవని చెప్పిన అరవిందులు ఆయన భూమికల గురించి సవిస్తరంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ భూమికలన్నిటిలోను దివ్య చైతన్యం అంతర్గతమై ఉన్నదని, క్రమంగా ఊర్ధ్వంగా అధిరోహించిన కొద్దీ , ఈ చైతన్యం స్వయంప్రకాశమాన మవుతున్నదని అరవిందుల యొక్క అభిప్రాయము గా ఉండేది.

చనిపోయేవరకు వరకు మౌనంగానే
నవంబరు 24 న తన దగ్గర ఉన్న శిష్యులతో నిన్నటి రోజున కృష్ణచైతన్యము తిరిగిభూమి మీద అవతరించింది అని బోధించి అప్పటినుండి చనిపోయేవరకు వరకు మౌనంగానే ఉండిపోయారు. ఇంతవరకు ప్రపంచంలో పదార్ధము , ప్రాణశక్తి మనస్సులు మాత్రమే ఆవర్భవించాయని వీటితో ఆధ్యాత్మిక పరిణామం నిలిచిపోలేదని క్రమంగా మనస్సుకు పైబడిన ఉన్నత భూమికలు కూడా పృధ్వి పై అవతరించగలవని అదే ఆధ్యాత్మిక పరిణామంలో అంతర్ధానమని అరవిందులు తెలియచేసారు.

దివ్యజీవనము అనే తాత్విక గ్రంథంలో:
అరవిందులు తమ సిద్ధాంతాలన్నీ దివ్యజీవనము అనే తాత్విక గ్రంథంలో వివరంగా తెలియచేసారు. వీరురచించిన గీతవ్యాసాలు అనేది కూడా ప్రాచుర్యం పొందిన గ్రంథము. వీరు వ్రాసిన కవితలు మిస్టిక్ పొయిట్రీ , లవ్ అండ్ డెత్, సిక్స్ పోయమ్స్ ,సావిత్రి కచ్చితం గా చదవవలిసిన రచనలు గా చెప్పబడ్డాయి.

యోగసాధకుల సంఖ్య నెమ్మదిగా పెరిగింది:
1910 వ సంవత్సరం లో అరవింద ఘోష్​ యోగ సాధనకు పాండిచ్చేరికి వెళ్లడం తో అక్కడికి యోగసాధకుల సంఖ్య నెమ్మదిగా పెరిగింది. 1926 వ సంవత్సరం లో అరవింద ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1950 వ సంవత్సరం డిసెంబర్​ 5 వ తేదీన ఆయన మరణించారు. 1947 వ సంవత్సరం లో జరిగిన దేశవిభజన ప్రతిపాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. భవిష్యత్​లో భారత్–పాకిస్తాన్(ఇప్పుటి బంగ్లాదేశ్) కలిసి అఖండ భారత్​ ఏర్పడుతుందని యోగ దృష్టితో తెలియచేసారు.

దైవనిర్ణయమని భావించాలి :
ఏడేండ్ల పసితనంలో అరవింద ఘోష్​ను ఇంగ్లాండు కు పంపించి 14 ఏళ్లపాటు ఇంగ్లిష్​ చదువులు చదివి తెల్లదొర లా తన కొడుకు ఉండాలని తండ్రి కోరుకుంటే ,అరబింద్ మాత్రం చివరకు విద్యావేత్తగా, రచయితగా,స్వాతంత్ర్య సమరయోధుడిగా, కవిగా, ఆధ్యాత్మికవేత్తగా, యోగీశ్వరుడిగా మారడం అనేది దైవనిర్ణయమని అనుకోక తప్పదు.