Rabindranadh Tagore: చరిత్ర నిజాలు: రవీంద్ర నాథ్ ఠాగూర్ ఈ రచనలు చదవకపొతే జీవితం సంపూర్ణాం కానట్టే!!

Rabindranadh Tagore: రవీంద్రనాథ్ ఠాగూర్ బాల్యం :
వంగదేశంలో 1861 మే 7 వ తేదీన దేవేంద్రనాథ్ ఠాగూర్ , శారదా దేవీలకు పద్నాలుగవ సంతానంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించారు. ‘ఠాగూర్’ అనగా ‘గౌరవప్రదమైన అయ్యా’ అని అర్థం. రవీంద్రనాథ్ తల్లి శారదాదేవి ఆయన చిన్నతనంలోనే మరణించారు. తల్లిని పోగొట్టుకోవడం వలన ఆయన నౌకర్ల చేతిలో పెరగవలిసి వచ్చింది. ఇంకా చెప్పాలి అంటే ఆయన బాల్యం చాలా విచిత్రం గా గడిచింది. ఆముదం దీపం ముందు పుస్తకం పట్టుకొని ఆవలిస్తూ కునికిపాట్లు పడుతూ చదివేవాడు.

Rabindranadh Tagore: చిన్నతనం నుంచే ప్రకృతి ఆరాధన:

నిద్ర లేవగానే ఇంటి తోటలోకి వెళ్లి ప్రకృతి సౌందర్యాన్ని చూసి చాలా బాగా సంతోషపడేవాడు. ఆయనకు కథలంటే మహా ఇష్టం. సామాన్యమైన దుస్తులతో, చాలా నిరాడంబరంగా పెరిగారు. చిన్న తనం లో ఇంట్లో నాలుగు గోడల మధ్య గడపవలసి రావటంతో ఆయనకు బయట ప్రపంచం చాలా అద్భుతంగా కనబడేది. ప్రపంచం ఒక రహస్య మనీ, ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి చాలా కుతూహలం చూపేవాడు.

ఇల్లే పాఠశాల :

రవీంద్రుడు పాఠశాలలో చదవడానికి ఇష్టపడక ఇంట్లోనే క్రమశిక్షణతో ప్రతి ఉదయం వ్యాయామం చేసుకున్న తర్వాత, లెక్కలు చేసి, భూగోళ పాఠాలను, చరిత్ర చదువుకుని సాయంత్రం సమయం లో చిత్రలేఖనం, ఆటలు, ఇంగ్లీష్ ను నేర్చుకునేవాడు. ఆదివారాలలో సంగీత పాఠాలు తో పాటు భౌతిక శాస్త్రం ప్రయోగాలు, సంస్కృత వ్యాకరణం నేర్చుకునేవాడు. బొమ్మలున్న ఆంగ్ల నవలలు స్వయంగా తానే చదువుకునేవాడు. కాళిదాసు ,షేక్స్పియర్ రచనలు చదివేవారు . భాషను క్షుణ్ణంగా నేర్చుకుని మాతృభాష పట్ల అభిమానం పెంచుకున్నారు.

ఆంగ్లసంస్కృతి సంప్రదాయాలు:

రవీంద్రుడు ఇంగ్లాండ్ లో ఒక పబ్లిక్ స్కూల్ లో చేరి, ప్రొఫెసర్ మార్లే ఉపన్యాసాలు విని ఆంగ్ల సాహిత్యం మీద ఇష్టం పెంచుకున్నాడు. సాహితీపరుల ప్రసంగాలు విని వారితో సంభాషించి నాటకాలు, సంగీత కచేరీల కు వెళ్లి, ఆంగ్లసంస్కృతి సంప్రదాయాలు బాగా వంటపట్టించుకున్నాడు. తన అనుభవాలను భారతి కి లేఖ వ్రాసి పంపేవారు. రవీంద్రుడు ఇంగ్లండులో ఉండగా భగ్న హృదయం అనే కావ్యాన్ని రాసారు. అయితే ఇంగ్లండులో పద్దెనిమిది నెలలు ఉండి ఏ డిగ్రీ నీ సంపాదించకుండా నే స్వదేశానికి తిరిగి వచ్చారు.ఆ తర్వాత 1883 వ సంవత్సరం డిసెంబర్ 9 వ తారీఖున మృణాలిని దేవిని వివాహం చేసుకున్నారు.

రచయితగా :
రవీంద్రుడు చిన్న తనం లోనే అనేక పద్యాలు, వ్యాసాలు, విమర్శలు ప్రచురించారు. ఆయన రచించిన సంధ్యా గీత్ కావ్యాన్ని కవులందరూ మెచ్చుకునేవారు. వందేమాతరం గీతాన్ని రచించిన బకించంద్ర ఛటర్జీ కూడా రవీంద్రుని మెచ్చుకునేవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన భక్తి గీతాలు తండ్రి విని, వాటి ప్రచురణ కి కావలసిన డబ్బు ఇచ్చేవారు. ఆ తర్వాత రవీంద్రుడు వర్గ రేర్ స్వప్న భంగ, సంగీత ప్రభాత అనే కావ్యాన్ని రచించారు.

రవీంద్రుని గీతాంజలి:

రవీంద్రుని రచనలలో గీతాంజలి చాలా గొప్పదిగా చెప్పబడింది. రవీంద్రుడు తాను బెంగాలీ భాషలో రచించిన భక్తి గీతాలు కొన్నింటిని ఆంగ్లంలోకి కూడా అనువదించి గీతాంజలి అని పేరు పెట్టారు. అది అనేక ప్రపంచ భాషలలోనికి అనువదించబడింది. ప్రపంచ సాహిత్యంలోనే ఇది ఒక గొప్ప రచన గా నిలిచింది. మనిషిని కృంగదీసే నిరాశ నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూసి శ్రమ యొక్క గొప్పతనాన్ని తెలియచేసే మహత్తర సందేశం గీతాంజలి యొక్క సారాంశం. 1913 వ సంవత్సరంలో సాహిత్యానికి సంబంధించిన రవీంద్రుని గీతాంజలి కి నోబెల్ బహుమతి దక్కింది. విశ్వకవి అనే బిరుదును కూడా సాధించి పెట్టింది. ఆసియా ఖండంలో మొదటిసారి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి రవీంద్ర నాథ్ ఠాగూర్. గీతాంజలి వెలువడిన తర్వాత అన్ని దేశాలవారు రవీంద్రుని గ్రంథాలు చదవడం మొదలు పెట్టారు.

శాంతినికేతన్‌:

రవీంద్రుడు కేవలం రచయితగానే ఉండి పోకుండా బాలల హృదయాలను వికసింప చేయడం కోసం ప్రాచీన ఋషుల గురుకులాల తరహాలోనే శాంతినికేతన్‌గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని ప్రారంబించారు. అది ఐదుగురు విద్యార్థుల తో మొదలై, క్రమంగా విస్తరించింది. చిన్న పిల్లలు ఉపాధ్యాయుల ఇళ్లల్లో భోజనం చేసేవారు. ప్రాతఃకాలం లోనే నిద్ర లేవడం, కాలకృత్యాలు తీర్చుకుని, తమ గదులను తామే శుభ్రపరచుకుని స్నానం చేయడం, ప్రార్థన చేయడం, నియమిత సమయానికి నిద్ర పోవడం అనేది వారి దినచర్య. ఆరోగ్యం కాపాడుకోవడం, పరిశుభ్రత గా ఉండడం, సత్యాన్ని పలకడం, కాలినడకన వెళ్లడం , పెద్దలను, గురువులను గౌరవించటం విద్యార్థులకు నేర్పేవారు.

కళా భవన్ స్థాపించడం:

1919 వ సంవత్సరం లో కళా భవన్ ను ఆయన స్థాపించడం జరిగింది. ఇక్కడ విద్యార్థులు విభిన్న కళలను నేర్చుకునే అవకాశం కల్పించారు.
గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని రవీంద్రనాథ్ భావించేవారు. అందుకే శ్రీ నికేతన్ నెలకొల్పి, గ్రామ పునర్నిర్మాణానికి ఎంతగానో పాటుపడ్డారు. రవీంద్రుడు మొదట వాల్మీకి ప్రతిభ అనే నాటకాన్ని రచించారు. ఆ తర్వాత అమల్ అనే పిల్లవాణ్ణి గురించి పోస్టాఫీసు నాటకం రాయడం జరిగింది. రవీంద్రనాథ్ రచించిన చిత్రాంగద నాటకం ఆయనకు మంచి పేరు ను తెచ్చిపెట్టింది. ప్రకృతి – ప్రతీక అనే నాటకంలో ప్రపంచాన్ని విడిచి పెట్టిన సన్యాసి కథను వివరించారు. రవీంద్రుడు కచదేవయాని, విసర్జన, నటిర్‌పూజ శరదోత్సవ్, ముక్తధార, మొదలగు అనేక శ్రేష్టమైన నాటకాలు రాసారు. మతాలు వేరైనా పరస్పర స్నేహం తో కలిసి మెలసి ఉండాలి అనే సాంఘిక ప్రయోజనం, ఉత్తమ సందేశం మిళితమైన గోరా నవల వలన రవీంద్రనాథ్ కి మంచి పేరు వచ్చింది.

డెబ్భై ఏళ్ళ వయస్సులో చిత్రకళా:

రవీంద్రనాథ్ ఠాగూర్ తన డెబ్భై ఏళ్ళ వయస్సులో చిత్రకళా సాధనను ప్రారంభించారు . ఆయన వేసిన చిత్రాలు లండన్, ప్యారిస్, న్యూయార్కు వంటి నగరాలలో ప్రదర్శించబడ్డాయి. ఆయన దాదాపుగా రెండు వేల చిత్రాలను గీశారు.

సంగీతం అనే ప్రత్యేక శాఖ:

రవీంద్ర నాథ్ కి సంగీతమంటే చాలా ఇష్టం. ఆయన బెంగాల్ జానపద గీతాలు, బాపుల్ కీర్తనలు విని ముగ్ధుడయ్యాడు. ఆయన గాయకుడు కూడా . భారతీయ సంగీతంలో రవీంద్రనాథ్ సంగీతం అనే ప్రత్యేక శాఖను ఏర్పరిచారు
రవీంద్రనాథ్ మొదటి నుండి జాతీయ భావాలున్న వాడు. హిందూ మేళాలో దేశభక్తి గీతాలు పాడారు. పృథ్వీరాజ్ పరాజయం గురించి ప్రబోధాత్మక పద్య నాటకాలు రాయడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం తిలక్ ను నిర్భంధించినపుడు రవీంద్రుడు తీవ్రంగా విమర్శించారు.

బెంగాల్ విభజన ప్రతిఘటనోద్యమం:

బెంగాల్ విభజన ప్రతిఘటనోద్యమంలో రవీంద్రనాథ్ ముఖ్య పాత్ర పోషించాడు. జాతీయ నిధి కోసం విరాళాలు వసూలు చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 1896 వ సంవత్సరం లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సదస్సులో మొట్టమొదటి బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరాన్ని పాడారు.

రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమణ
రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జనగణమణ ను జాతీయ గీతంగా ప్రకటించే ముందు వందేమాతరం , జనగణమన లలో దేనిని జాతీయ గీతంగా ప్రకటించాలని సుదీర్ఘ చర్చ, చాలా తర్జన భర్జనలు జరిగాయి. చివరగా రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన దే పైచేయి గా నిలిచింది. దీంతో రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24 న జనగణమన ను జాతీయ గీతంగా వందేమాతరం ను జాతీయ గేయంగా ప్రకటించారు. అదే సమయంలో రెండు సమాన ప్రతిపత్తిని కలిగి ఉంటాయని స్పష్టం చేసారు.

రవీంద్రుని తో గాంధీ ,నెహ్రూలు

గీతాంజలి రవీంద్రునికి కవిగా ప్రపంచ ఖ్యాతిని తీసుకువచ్చింది. ఈ కావ్యంలోని ఈ కింది గీతం మహాత్మాగాంధీకి మిక్కిలి అభిమాన పాత్రమైంది గా చెప్పబడింది.ఈ మంత్రాలు జపమాలలు విడిచిపెట్టు తలుపు లన్నింటినీ బంధించి ఈ చీకటి గదిలో ఎవరిని పూజిస్తున్నారు? కళ్ళు తెరచి చూస్తే నీవు ఆరాధించే దేవుడు నీ ఎదుట లేడు! ఎక్కడ రైతు నేలను దున్నుతున్నాడో, ఎక్కడ శ్రామికుడు రాళ్ళు పగులగొట్టుతున్నాడో,అక్కడ ఆ పరమాత్ముడున్నాడు.వారితో ఎండలో, వానలో ధూళి ధూపరితములైన వస్త్రములలో ఉన్నాడు. నీవు కూడా నీ పట్టు పీతాంబరాలు అవతల పెట్టి ఆ నేల మీదికి పదా…
తన జీవితంపై రవీంద్రనాథ్ ప్రభావమెంతో ఉన్నదని జవహర్ లాల్ నెహ్రూ స్వయంగా చెప్పుకున్నారు.

మరణం :
రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు, రవీంద్రనాథ్ మానసికంగా కుంగిపోయి అనారోగ్యం బారిన పడ్డారు. తీవ్రంగా వ్యాధితో బాధపడుతూ, చికిత్స కోసం కలకత్తా నగరానికి వెళ్లాడు. అయినా కూడా ప్రయోజనం లేకపోయింది. రచయితగా, సంగీత వేత్తగా, చిత్రకారునిగా, విద్యావేత్తగా గొప్ప మానవతా వేత్త గా ఠాగూర్ చరిత్రలో నిలిచిపోయారు. మాతృభూమి, మానవసంబంధాల పట్ల అచంచలమైన నమ్మకం, ప్రేమాభిమానాలు కలిగి ఉన్న విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, 1941 ఆగష్టు 7 న మరణించారు.

రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి కొన్ని ముఖ్య విషయాలు:

8 సంవత్సరాలకే రవీంద్రనాథ్ కవిత్వం రాయటం మొదలు పెట్టారు. 16 ఏళ్లకు తన మొదటి పుస్తకం భానుసింహ ను అచ్చు వేశారు.రవీంద్ర నాథ్ సంగీతం లో , చిత్రాలు గీయడం లో, నటుడిగా కూడా ప్రతిభ కలిగిన వ్యక్తి గా గుర్తింపు పొందారు.ఆయన చిత్రకారుడిగా 2000కు పైగా పెయింటింగ్స్ వేశారు. ఆయన రాసిన నాటకాలను సినిమాలుగా కూడా తీసారు.భారత దేశానికి జాతీయ గీతాన్ని అందచేసిన కవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌.అంతే కాదు బంగ్లాదేశ్‌ జాతీయ గీతాన్ని రాసింది కూడా రవీంద్రనాథ్ ఠాగూరే కావడం గమనార్హం.

రెండు దేశాలకు జాతీయ గీతం:

ప్రపంచంలో రెండు దేశాలకు జాతీయ గీతం రాసిన ఏకైక వ్యక్తి గా ఠాగూరు గుర్తింపు పొందారు. ఠాగూర్‌ సంపాదకత్వంలో వెలువడే తత్త్వబోధిని అనే పత్రికలో భారతవిధాతా అనే శీర్షికతో ముందు రచించారు. ఈ గీతం బెంగాలీ భాషలో మొత్తం 31 చరణాలు ఉండేవి. కానీ అందులో మనం ఏడు చరణాలు మాత్రమే ఇప్పుడు జాతీయగీతంగా ఆలపిస్తున్నాం.
ఆయన చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో ఉన్నప్పుడు జనగణ మనను ఇంగ్లీష్ లోకి అనువాదం చేశారు. 1919 వ సంవత్సరం లో మదనపల్లె వచ్చిన ఠాగోర్ జనగణమనను ఆంగ్లంలోకి తర్జుమా చేసి బహిరంగంగా ఆలపించడం అనేది జరిగింది.

ఆయనే స్వయంగా సంగీతం:

2200 పాటలకు ఆయనే స్వయంగా సంగీతం సమకూర్చారు. టుమ్రి స్టయిల్లో ఆయన స్వరపరిచిన గీతాలు రవీంద్ర సంగీత్ పేరుతో చాలా ప్రసిద్దికి ఎక్కాయి. 1915 వ సంవత్సరం లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను నైట్ హుడ్ తో గౌరవించింది.

మహాత్మా అని సంభోదించిన వ్యక్తి:

గాంధీ జీని ని మొట్టమొదటగా మహాత్మా అని సంభోదించిన వ్యక్తి ఠాగూర్‌ అనే చెప్పాలి. వీరు ఇద్దరు మొట్టమొదటి సారిగా 1914 వ సంవత్సరం లో కలుసుకోవడం జరిగింది.
ప్రతి ఒక్కరు ఠాగూరు గారి రచనలు చెడివి తీరవలిసిందే.