Sunset : సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!!

Sunset : దానం చేయడం అనేది పుణ్య ఫలితాలను అందిస్తాయని శాస్త్రంలో చెప్పబడింది. అయితే దానం చేయడానికి కూడా కొంత సమయం ఉంటుందని , ఆ సమయంలోనే దానం చేయడం వల్ల దానం యొక్క ఫలితం లభిస్తుందని సమాచారం. అయితే సూర్యాస్తమయం తర్వాత కొన్ని రకాల వస్తువులను ఇతరులకు దానం చేయకూడదు. మరి సూర్యాస్తమయం తర్వాత దానం చేయకూడదని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. దానం అనేది ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు కాబట్టి అందరికీ ఈ ఆర్టికల్ ను వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.

సూర్యాస్తమయం తర్వాత మజ్జిగ లేదా పాలు అలాగే పాల ఉత్పత్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు దానంగా లేదా అప్పుగా ఇవ్వకూడదు. ఇక అలాగే పులుపు పదార్థాలను కూడా సూర్యాస్తమయం తర్వాత ఇతరులకు ఇవ్వకూడదు. ఇక ఉప్పు, పసుపు , దీపం, నూనె లాంటివి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు ఇవ్వకూడదు. అలాగే ఇతరుల నుంచి తీసుకోకూడదు. ముఖ్యంగా దాన ధర్మం అనేది ఆనందాన్ని కలిగిస్తుందని శాస్త్రంలో చెప్పబడినప్పటికీ దాన ధర్మం చేయడానికి కూడా ఒక సమయం ఉంటుంది. అందుకే సూర్యాస్తమయం లో ఇలాంటి పనులు అసలు చేయకూడదు.

Doing these things after sunset
Doing these things after sunset

సూర్యాస్తమయం తర్వాత డబ్బును కూడా ఎట్టి పరిస్థితిలో విరాళంగా, దానంగా , అప్పుగా ఇవ్వకూడదు. అలాగే ఇతరుల నుంచి కూడా తీసుకోకూడదు. ఇతరుల నుంచి డబ్బుని దానంగా లేదా అప్పుగా తీసుకున్నట్లయితే ప్రతికూల ప్రభావం మనపై పడి ఆర్థిక నష్టం ఎక్కువ అవుతుందట. అంతే కాదు ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువ అవుతాయని శాస్త్రం చెబుతోంది. ఇక సూర్యాస్తమయం తర్వాత వెల్లుల్లి, ఉల్లిపాయలను కూడా ఎవరైనా అడిగినా అసలు ఇవ్వవద్దు. జ్యోతిష్యం ప్రకారం వెల్లుల్లి, ఉల్లిపాయ కేతువుతో సంబంధం కలిగి ఉన్న నేపథ్యంలో వ్యాపార నష్టం కలుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి సూర్యాస్థమయం తర్వాత ఇవ్వకండి.