Laughing Buddha : వాస్తు శాస్త్రం ప్రకారం లాఫింగ్ బుద్ధ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ముఖ్యంగా ఎవరికైనా సరే లాఫింగ్ బుద్ధను బహుమతిగా ఇవ్వడం శుభ సంకేతంగా సూచిస్తారు. ఆర్థిక సంపద వృద్ధి చెందాలి అంటే వాస్తు శాస్త్రం ప్రకారం లాఫింగ్ బుద్ధను ఇంట్లో లేదా పని ప్రదేశంలో పెట్టుకోవడం వల్ల సంపద పెరుగుతుంది. ఇక ఎవరైనా సరే కోపం లో ఉన్నప్పుడు పది సెకండ్ల పాటు లాఫింగ్ బుద్ధాను చూస్తే ఇట్టే కోపం పోతుందట. అంతేకాదు లాఫింగ్ బుద్ధ ను ఇంట్లో పెట్టుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి ప్రవేశించ లేదు. లాఫింగ్ బుద్ధ ను సరైన ప్రదేశంలో సరైన దిశలో సరైన దిక్కుగా ఉంచినట్లయితే ఆ ఇంట్లో డబ్బు కు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉండవట.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పెట్టకూడని ప్రదేశాలు కూడా కొన్ని ఉన్నాయి.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లాఫింగ్ బుద్ధ ను ఎక్కడ ..ఏ దిశలో.. ఎలా పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని భూమినుంచి కేవలం ముప్పై అంగుళాలు గరిష్టంగా 32.5 అంగుళాల ఎత్తులో మాత్రమే ప్రధాన ద్వారం ముందు ఉంచుకోవచ్చని వాస్తు శాస్త్రం చెబుతోంది. ప్రధాన ద్వారం దగ్గర పెట్టడానికి గల కారణం ఏమిటంటే మెయిన్ డోర్ తెరవగానే మొదట లాఫింగ్ బుద్ధను చూస్తారు కాబట్టి ద్వారం దగ్గర పెట్టడమే మంచిది.
ప్రధాన ద్వారం వద్ద ఉన్న వ్యక్తికి వచ్చే ప్రతికూల శక్తిని తొలగించడానికి లాఫింగ్ బుద్ధ సహాయపడుతుంది. తద్వారా అతని నుంచి వచ్చే నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశించ లేదు. మీ ఇంటి ముందు స్థలం లేకపోతే సూర్యుడు ఉదయించే తూర్పు దిశల్లో కూడా ఉంచుకోవచ్చు. లాఫింగ్ బుద్ధ అదృష్టానికి చిహ్నం కాబట్టి వంటగది, డైనింగ్ హాల్ , పడక గది , టాయిలెట్లు వంటి ప్రదేశాలలో ఉంచకూడదు కేవలం సింహ ద్వారం ఎదురుగా మాత్రమే తూర్పు దిశకు పెట్టాలి అంతే కాదు నేల పై కూడా పెట్టకూడదు. ఇలా కొన్ని చిట్కాలు పాటించినట్లయితే లాఫింగ్ బుద్ధ కారణంగా మీ ఇంటికి సంపద పెరుగుతుంది.