Health Benefits : రెడ్డివారి నానుబాలు మొక్కతో ఆ సమస్యలకు చెక్..!

Reddyvaari Nanu Balu: రోజు మనం చూసే మొక్కలో రెడ్డివారి నానుబాలు మొక్క ఒకటి.. ఈ మొక్కలో మనకు తెలియని ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.. ఈ మొక్కను పాలకాడ, పచ్చబొట్టు ఆకు, నాగార్జుని, రెడ్డివారి నానుబాలు మొక్క అని ప్రాంతాల్ని బట్టి రకరకాలుగా పిలుస్తూ ఉంటారు.. ఈ మొక్కను అనేక సంవత్సరాల నుంచి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు.. రెడ్డివారి నానుబాలు మొక్క ఎలాంటి వ్యాధులకు చెక్ పెడుతుందంటే..

రెడ్డివారి నానుబాలు మొక్క ను మొత్తం సమూలంగా తీసుకొచ్చి దంచి రసం తీసుకోవాలి. ఈ రసంలో 9 మిరియాల గింజల పొడిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వరుసగా మూడు రోజులపాటు తీసుకుంటే రుతుక్రమం సమయంలో వచ్చే అన్ని రకాల నొప్పులను తగ్గిస్తుంది. అధిక రక్తస్రావం, కడుపు నొప్పి, చికాకు, వికారాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా స్త్రీలలో గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. సంతాన సాఫల్యత కలిగేలా చేస్తుంది. రెడ్డివారి నానుబాలు మొక్క ను మొత్తం సమూలంగా తీసుకొచ్చి.. ఒక లీటర్ నీటిలో వేసి 10 నిమిషాలు మరిగించాలి. ఈ నీటిని ఒక గాజు సీసాలోకి పోసుకుని భద్రపరుచుకోవాలి. ఈ కషాయం గోరువెచ్చగా ఉన్నప్పుడు రోజు మొత్తం మీద మీకు ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు తాగుతూ ఉంటే మొండి జ్వరాలు, డెంగ్యూ ఫీవర్, వైరల్ ఫీవర్స్ ను తగ్గిస్తుంది.

Amazing Health Benefits Of Reddyvaari Nanu Balu Plant
Amazing Health Benefits Of Reddyvaari Nanu Balu Plant

అంతేకాకుండా ఈ కషాయం తాగితే దేహంలో రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తుంది.రెడ్డివారి నానుబాలు మొక్క ను మొత్తం సమూలంగా తీసుకొచ్చి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడికి అంతే మోతాదులో పటిక బెల్లం పొడిని కలపాలి. ఈ పొడిని ఒక గ్లాసు సీసాలో నిల్వచేసుకోవాలి. ఉదయం పరగడుపున ఒక గ్లాసు పాలలో ఒక స్పూన్ పొడిని కలిపి తీసుకుంటే శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. పురుషులలో వీర్య కణాల వృద్ధి చెందుతుంది. ఈ చూర్ణం ను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. మధుమేహాన్ని తగ్గిస్తుంది.

Advertisement