Vastu Tips : వాస్తు ప్రకారం ఈ మొక్కలు నాటితే పట్టిందల్లా బంగారమే..!!

Vastu Tips : ఇక మరొక వారం రోజులు ఆగితే ఆషాడమాసం పోయి శ్రావణమాసం మొదలవుతుంది.ఇక శ్రావణమాసం అనేది హిందువులకు ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఇలాంటి పవిత్రమైన మాసంలో మీరు కొన్ని మొక్కలను వాస్తు ప్రకారం నాటినట్లయితే పట్టిందల్లా బంగారమే. అంతే కాదు మీ సమస్యలన్నీ తొలగిపోయి మీకు మంచి చేకూరుతుందని పండితులు కూడా తెలియజేస్తున్నారు. మనిషి జీవితంలో పురోగతి, సంపద సాధించాలంటే ఈ మొక్కలు తప్పనిసరిగా నాటాల్సిందే.

జమ్మి మొక్క : శ్రావణమాసంలో శివుడికి జమ్మి ఆకులను నైవేద్యంగా పెట్టడం వల్ల అంతా మంచే జరుగుతుందని ప్రతి ఒక్కరు భావిస్తారు. ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కలకు చాలా ప్రాముఖ్యత కూడా ఉంది. శని దేవుడు శివుడితో సంబంధం కలిగి ఉంటాడని, ఆయన శివ భక్తుడు అని చెబుతూ ఉంటారు. కాబట్టి శ్రావణమాసంలో ఇంట్లో ఈ మొక్కను ఉంచడం ద్వారా శని కృప కూడా మీకు కలుగుతుంది అని కష్టాలు దరిచేరవు అని పండితులు చెబుతున్నారు.

Vastu Tips All it takes to plant these plants is gold
Vastu Tips All it takes to plant these plants is gold

సంపంగి మొక్క : శ్రావణమాసంలో సంపంగి మొక్కను ఇంటి పరిసరాలలో నాటడం వల్ల అదృష్టం ప్రకాశిస్తుంది అని పండితులు చెబుతున్నారు. ఇక ఇంటి చుట్టూ చిన్న కుండీలలో కూడా మీరు ఈ మొక్కలను నాటవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి డబ్బు రావడమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఆ కుటుంబంపై ఉంటుంది. పూర్తి ప్రయోజనాలను పొందాలి అంటే శ్రావణమాసంలోనే ఈ మొక్కను నాటడం తప్పనిసరి.

బిల్వ వృక్షం : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు బిల్వ వృక్షం నాటడం వల్ల చాలా శ్రేయస్కరం.. శివుడికి ఎంతో ఇష్టమైన ఈ బిల్వ వృక్షాన్ని మీరు నాటడం వల్ల అదృష్టం పడుతుంది. అంతేకాదు సంపద యొక్క దేవుడు కుబేరుడి వాసనను ఈ మొక్క చూస్తుంది. కాబట్టి ఇంట్లో నాటడం వల్ల వాస్తు దోషం తొలగిపోయి మొక్క పెరిగే కొద్దీ మనిషి ఎదుగుదల కూడా పెరుగుతుంది.

ఉమ్మెత్త మొక్క : మరీ ముఖ్యంగా శ్రావణ కార్తీక మాసాలలో శివుడిని ప్రసన్నం చేసుకోవాలి అంటే తప్పకుండా ఉమ్మెత్త పువ్వులతో పూజ చేయాలి. ఇక అప్పుడే స్వామి వారు ప్రసన్నుడై భక్తుల కష్టాలు అన్నింటిని తొలగిస్తాడు అని నానుడి. కాబట్టి మీ ఇంటి పరిసరాలలో ఈ మొక్కలు కూడా నాటడం మంచిది.

తెల్ల జిల్లేడు మొక్క : ఈ మొక్కలో వినాయకుడు ఉంటాడు అని శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా సానుకూల శక్తిని ఆకర్షించే సామర్థ్యాన్ని ఈ మొక్క కలిగి ఉండడం వల్ల మీ జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఇక చాలా తేలికగా ఫలాలను ఇస్తుంది .కాబట్టి మీ ఇంటి ఆవరణలో ఈ మొక్కలను పెంచవచ్చు.