Health Benefits : దురద పెట్టె కందలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Health Benefits : కందలో అధిక పోషకాలు , ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనం వాడే కూరగాయల్లో కంద ఒక్కటీ. కందను దురదకు పర్యాయపదం గా చెప్పుకోవచ్చు.కందుకులేని దురద కత్తిపీటకి ఎందుకు అని సామెతలు చెబుతారు పెద్దలు.కంద ను కోసేటప్పుడు అరచేతులు దురద పెడతాయి.అందువలన కొంతమంది కందను తినటానికి ఇష్టపడరు. అయితే ఇప్పుడు చెప్పే ప్రయోజనాలు తెలిస్తే ఖచ్చితంగా తినడానికి ప్రయత్నం చేస్తారు. మధుమేహులు, ఉబకాయంతో బాధపడేవారు , హార్ట్ ప్రోబ్లమ్స్ కలిగిన వారికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే విటమిన్స్, ఫైటో న్యుట్రియన్స్ వంటివి ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడతాయి. విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా చేస్తాయి.మరియు శరీరంలో ఇమ్యూనిటీ పవర్ బాగా పని చేసేలా చేసి ఎటువంటి క్రిములతోనైనా తో పోరాడే శక్తిని శరీరానికి కలిగిస్తుంది.

ఇందులో విటమిన్ b6(సయ్యకోబలమైన్ )ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని వారంలో రెండు సార్లనా తప్పక తినాలి. ఇలాంటి బలవర్ధకమైన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి ఎర్ర రక్త కణాలు బాగా వృద్ధి చెందేలా చేస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీ లకు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతుంటారు. అలాంటి వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో పీచు పదార్థం సమృద్ధిగా ఉండటం వలన బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా జీర్ణసంబంధ సమస్యలైన గ్యాస్ట్రిక్, మలబద్ధకం, ఆసిడిటీ వంటి సమస్యలకు మంచి ఆయుర్వేదం ఔషాదంగా పనిచేస్తుంది. పూర్వం అల్జిమర్స్ అనేది ముసలితనంలో వచ్చే సాధారణ సమస్యగా ఉండేది.కానీ ఇప్పుడు అలసట, ఒత్తిడి, శారీరక శ్రమలేకపోవడం వల్ల యుక్తవయసులోనే అల్జిమర్స్ కనబడుతుంది.35 నుంచి 45 యేళ్ళ వయసు వచ్చేసరికి రోజులో ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని మర్చిపోవడం చేస్తుంటారు.

Health Benefits Of Elephant Yam Kanda Gadda
Health Benefits Of Elephant Yam Kanda Gadda

ఇలాంటి సమయంలో ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయకుండా వైద్యులని సంప్రదించాలి. అలాగే ఉంటే గోటితో పోయేది గొడ్డలి వరకు వచ్చినట్టు,మతిమరుపు కూడా నిదానంగా మొదలైనా చివరకు పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి సరైనా సమయంలో సరైనా జాగ్రత్తలు తీసుకోవాలి. మన ఆహారంలో వారానికి రెండు సార్లు కంద చేర్చుకుంటే మతిమరుపు మొదట్లోనే నివారించుకోవచ్చు .ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్., మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు జ్ఞాపక శక్తి పెరిగేలా చేస్తాయి. జ్ఞాపక శక్తి తగ్గితే పలు సమస్యలు చుట్టూముడతాయి.కనీసం వారానికి ఒకసారి తప్పనిసరిగా కంద తీసుకుంటే స్త్రీ లలో ఇస్ట్రోజన్ ఉత్పత్తిని పెంచి ఋతుక్రమణ సమస్యల నుంచి కాపాడుతుంది. పెద్దలలో వచ్చే కీళ్ళనొప్పులను నివారిస్తుంది.కందను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు వృద్యాప్య ఛాయలు రాకుండా చేస్తాయి