Daily Astrology : నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి వాహన ప్రమాదం.. జాగ్రత్త..!

Daily Astrology : రాశి ఫలాలుమేషం:
నిరుద్యోగులకు కష్టానిక తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలిస్తుంది. ఉద్యోగ విషయంలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలిస్తుంది.ఇతర వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది.

Today horoscope. Beware of accidents in these zoadic signs of people's..
Today horoscope. Beware of accidents in these zoadic signs of people’s..

వృషభం:
ఇంకా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు ఏర్పడతాయి. ఉద్యోగమున ఇతరులతో మాట పడవలసి ఉంటుంది. నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి.

మిధునం:
దూర ప్రాంతం బంధువులతో శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన లాభం లభిస్తుంది. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు వస్తాయి.

కర్కాటకం:
ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తప్పవు. కీలక వ్యవహారాలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. వాహన ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాల పరిష్కారానికి ఆటంకాలు ఏర్పడతాయి.

సింహం:
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య పరిస్థితి సంతృప్తిగా సాగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది

కన్య:
ఉద్యోగ విషయంలో అధికారుల నుండి సానుకూలత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా.. అవసరానికి ధనం అందుతుంది. రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు సాధిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.

తుల:
ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు . కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది.చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.

వృశ్చికం:
దైవ కార్యక్రమాలపై ఆసక్తి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉండదు. నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది. నూతన రుణాలు చేయకపోవడం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

ధనస్సు:
వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో భూసంబంధం , నూతన ఒప్పందాలు ప్రబలుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

మకరం:
కీలక వ్యవహారాలలో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశాలు ఉన్నాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొని ప్రశంసలు అందుకుంటారు.

కుంభం:
వృధా ఖర్చులను అదుపు చేయడం మంచిది. సంతాన ఆరోగ్యం విషయంలో వైద్యుడి సంప్రదింపులు చేస్తారు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలను ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులు తప్పవు.

మీనం:
ఇంటా బయట అనుకోలేక పెరుగుతుంది
.సన్నిహితుల నుండి అరుదైన శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి.