Daily Astrology : నేటి రాశి ఫలాలు..28 నవంబర్ 2022 సోమవారం రాశి ఫలాలు..! 

Daily Astrology : మేషం:
సమాజంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలమైన రోజు ఇది.. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా సాగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలు లాభిస్తాయి.. ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

Today horoscope.. 28-11-2022 Monday horoscope..!
Today horoscope.. 28-11-2022 Monday horoscope..!

వృషభం:
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు అంతగా రాణించవు. వ్యాపారమున కీలక సమయంలో నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయ సూచనలు కనిపిస్తున్నాయి.

మిధునం:
దీర్ఘకాలిక రుణ ఒత్తిడి ఎక్కువవుతుంది. నిరుద్యోగులకు నిరుత్సాహ వాతావరణ ఉంటుంది. కుటుంబ బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు ఏర్పడతాయి.

కర్కాటకం:
బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన పనులలో అవరోధాలు కలిగినా అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగమున ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి.

సింహం:
కీలక సమయంలో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య:
నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహం కలుగుతుంది. కుటుంబమున అవసరానికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

తుల:
ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. రుణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.

వృశ్చికం:
ఉద్యోగమున ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో వివాదాల నుంచి బయటపడతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో ఇబ్బందులు ఎదురైనా అధిగమించి లాభాలు పొందుతారు.

ధనస్సు:
చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేస్తారు. ఆర్థికపరంగా ఇబ్బందులు మరింత భాదిస్తాయి. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు.. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

మకరం:
దాయాదులతో భూ సంబంధిత వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగమున వివాదాలు పరిష్కరించుకుంటారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.

కుంభం:
దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగంలో అధికారులతో వివాదాలు కలిగే సూచనలున్నాయి. వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారమున భాగస్తులతో చిన్నపాటి వివాదాలు తప్పవు..

మీనం:
అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాల పట్ల సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి.