Karthika Deepam 28 Nov Episode : చావు బ్రతుకుల మధ్య దీప.. శౌర్య చూస్తుందా.!? కార్తీక్ కాపాడతాడా.!?

Karthika Deepam 28 Nov Episode : దీప వంట చేయడానికి కిచెన్ లోకి వెళ్తుండగా.. నీకు పొగ పడదు అని ఎన్నిసార్లు చెప్పాలి. నిన్ను వంట చేయొద్దని చెబుతుంటే వినవేంటి అని కార్తీక్ అంటాడు. ఈ విషయాలన్నీ నీకు ఎలా తెలుసు.. ఎలా గుర్తున్నాయని నన్ను అడగద్దు. ఎందుకంటే నాకు గతం గుర్తొచ్చింది దీప.. ఇప్పుడు కాదు దీప నాకు గతం గుర్తుకు వచ్చి చాలా రోజులైంది.. శౌర్య ను మనం కలిసిన తర్వాత నీకు నిజం చెబుదామని అనుకున్నాను. ఒకవేళ నాకు గతం గుర్తుకు వచ్చిందని మోనితకు తెలిస్తే నీకు ఏమైనా ప్రమాదం జరుగుతుందేమోనని ఇన్ని రోజులు భయపడ్డాను..

karthika-deepam-28-nov-today full episode
karthika-deepam-28-nov-today full episode

అందుకే నీకు ఎన్ని రోజులు నుంచి చెప్పలేదు. ఇప్పుడు నీకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నీ ఆరోగ్యం ఏం బాగోలేదు నిన్ను అర్జెంటుగా హాస్పిటల్ లో చేర్పించాలి. నువ్వు హాస్పిటల్ లో నుంచి రికవరీ రాగానే వెంటనే సౌర్య గురించి మనిద్దరం కలిసి వెతుకుదాం. సరేనా అని కార్తీక్ దీప వైపు చూస్తాడు. ఆ లోపే దీప కళ్ళు తిరిగి కిందపడిపోయి ఉంటుంది. దీపను గబగబా తీసుకొని హాస్పిటల్ కి వెళ్తాడు కార్తీక్. హాస్పిటల్ బెడ్ పై పడి ఉన్న దీపను చూసి కార్తీక్ బాధపడతాడు. దీనంతటికీ కారణం నేనే అని ఫీల్ అవుతాడు.

ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు డాక్టర్ బాబు. భర్త ఎదురుగా ఉన్న గుర్తుపట్టలేని పరిస్థితి నాది. శౌర్య ఇక్కడే ఉందని తెలిసినా కూడా తనని దగ్గరికి తీసుకోలేకపోతున్నాను.. నా చుట్టూ ఎంత జరుగుతున్నా నేను ఏం చేయలేక పోతున్నాను. ఇలాంటి జీవితం నాకెందుకు అని దీప బాధపడుతుంది. నేనే నీ భర్తని నీకు ఇప్పుడు చెప్పలేను దీప. ఇందాక నేను చెప్పినప్పుడు నువ్వు స్పృహలో ఉండి ఉంటే బాగుండేది. ఇప్పుడు చెబితే నువ్వు ఓవర్ ఎగ్జైట్ అయినా కూడా నీ ఆరోగ్యానికి మంచిది కాదు. సర్జరీ అయిన తర్వాత మీకు కచ్చితంగా నిజం చెబుతాను అని కార్తీక్ అంటాడు. శౌర్యని ఎలాగైనా వెతకాలి డాక్టర్ బాబు.. ఒకవేళ నాకు జరగరానిది ఏమైనా జరిగితే నువ్వు శౌర్యని చూసుకుంటావు కదా అని దీప అడుగుతుంది. అలా మాట్లాడకు దీప నీకు అంతా మంచే జరుగుతుంది నేను ఉన్నాను కదా అని కార్తీక్ అంటాడు.

ఇక రేపటి ఎపిసోడ్లో కార్తీక్ ఫార్మాలిటీస్ అన్ని ఫీల్ చేసి మెడిసిన్ తీసుకువచ్చే లోపు దీప తన బెడ్డుపై ఉండదు. ఎక్కడికి వెళ్లిందని హాస్పిటల్ అంతా వెతుకుతాడు కానీ దీప కనిపించదు. దీప ఎక్కడో రోడ్డు పక్కన చెట్లలో పడి ఉంటుంది. అటుగా ఆటోలో వెళుతున్న ఇంద్రుడు సౌర్య ఆటో అతను ఎవరో పడిపోయారని చెబుతాడు. ఇంద్రుడు దీప చూసినా కానీ ఏడుస్తూ ఉంటాడు. మరోవైపు ఇంద్రుడు ఒడిలో ఉన్న శౌర్య ఎవరు బాబాయ్ అని అడుగుతుంది. ఇప్పటికైనా శౌర్య దీపా కలుస్తారా లేదా.. కార్తికే వెతుక్కుంటూ వచ్చి దీపను కాపాడుతాడా అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం.