Daily Astrology : నేటి రాశి ఫలాలు..18 నవంబర్ 2022 శుక్రవారం రాశి ఫలాలు..!

Daily Astrology : మేషం:
వృత్తి , వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సంతానం కొన్ని విషయాలలో మీతో విభేదించవచ్చు. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు . పాత రుణముల ఒత్తిడి పెరుగుతుంది
దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఏర్పడతాయి.

వృషభం:
నిరుద్యోగ ప్రయత్నాలు నిధానిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు పనిచేయవు. కుటుంబ సభ్యులతో అకారణ విభేదాలు ఏర్పడతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి.

Today horoscope.. 18 november 2022.. Friday horoscope
Today horoscope.. 18 november 2022.. Friday horoscope

మిధునం:
ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ప్రయాణాలలో నూతన పరిచయాల వల్ల ఆర్థిక లాభాలు పొందుతారు.

కర్కాటకం:
కొన్ని విషయాలలో అందరితో సమస్యలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులతో మాట పెట్టింపులు ఉంటాయి.. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించండి.

:
బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. నూతన అవకాశాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభం పొందుతారు.

కన్య:
చుట్టుపక్కల వారితో ఊహించని విధంగా విభేదాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

తుల:
నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. కీలక వ్యవహారాలలో మిత్రుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న అవసరాలకు ధన సహాయం లభిస్తుంది. దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

వృశ్చికం:
స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. చేపట్టిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. దూరప్రాంతాల ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఉద్యోగమున ఉన్నతాధికారుల అనుగ్రహం కలుగుతుంది.

ధనస్సు:
దైవ అనుగ్రహంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం:
కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో మరింత జాగ్రత్తగా ఉండండి. రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు . కుటుంబ వాతావరణం మరింత చికాకు కలిగిస్తుంది.
.

కుంభం:
ఉద్యోగమును అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

మీనం:
ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలు విజయవంతంగా ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు లభిస్తాయి.