Shiva temple: భారతదేశం ఆధ్యాత్మికతకు కేంద్రమని ప్రపంచ జనాలు అంటుంటారు. భారతదేశంలో కొన్ని కోట్ల మంది దేవతలకు పూజలు చేస్తూ ఉంటారు. ఎక్కువగా శివుడికి చాలామంది పూజలు చేస్తుంటారు. శివుడిని చాలా పవిత్రంగా కొలుస్తుంటారు. ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచంలో పలు దేశాలలో శివుని చాలా పవిత్రంగా కొలుస్తారు. ఇదే రకంగా ఇండోనేషియాలో కూడా శివుడు పూజింపబడతాడు. అక్కడ ఎక్కువగా ఉండేది ఇస్లాం మతస్తులు అయినా గాని కొంతమంది శివున్ని పూజించే వాళ్ళు ఉన్నారు.
ప్రపంచంలో అతి శక్తివంతమైన శివాలయం 1961 వ సంవత్సరంలో బయటపడటం జరిగిందట. అక్కడ శివాలయం ఉందని ఒక వరి రైతుకు కల వచ్చి మొత్తం తవ్వకాలు జరపగా 9 వ శతాబ్దానికి చెందిన హిందూ ఆలయం అని పురావస్థ శాఖ వారు కనుగొన్నారు. ఈ శివాలయం సుమారు 5 మీటర్ల భూగర్భంలో కనుగొనబడిందంట. దీనినే సాంబిసరి శివాలయం అని అంటుంటారు.
ఈ సాంబిసరి ఆలయ సముదాయంలో ఒక ప్రధాన ఆలయం మరియు దాని ముందు మూడు చిన్న పేర్వారా (సంరక్షక) ఆలయాల వరుస ఉన్నాయి. మధ్య పేర్వార ఆలయం , ఉత్తర మరియు దక్షిణ పేర్వార ఆలయం ఉన్నాయి . సాంబిసరి సముదాయం చుట్టూ తెల్లని రాతితో చేసిన దీర్ఘచతురస్రాకార గోడ 50 నుండి 48 మీటర్లు ఉంది. ఈ ప్రధాన యార్డ్ లో ఎనిమిది చిన్న లింగాలు, కార్డినల్ పాయింట్ల వద్ద నాలుగు, మూలల్లో మరో నాలుగు కనుగొన్నబడ్డయి.