Temple : బంగారాన్నే ప్రసాదంగా ఇస్తున్న ఆలయం..?

Temple : ఎక్కడైనా దేవాలయాలకు వెళ్తే అక్కడ ఆ ఆలయంలో ప్రసాదంగా ఏదైనా పులిహోర, చక్కెర పొంగలి , ఇతర వాటిని ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. ప్రపంచంలో అన్ని దేశాల దేవాలయాల్లో వీటినే నైవేద్యంగా ఇస్తూ ఉంటారు. అయితే ఈమధ్య కొన్ని ప్రాంతాలలో మాత్రం కొత్త కొత్త వాటిని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతోంది. తాజాగా ఇప్పుడు ఒక ఆలయంలో మాత్రం దైవదర్శనం కోసం వెళ్ళిన భక్తులకు బంగారు లేదా వెండి, డబ్బులు ప్రసాదంగా ఇస్తున్నారట. మరి ఆ ఆలయం ఎక్కడ ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ ఆలయం కూడా మన దేశంలో లేని ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో బంగారం, నగదు ప్రసాదంగా ఇస్తున్నారు. ఇది మధ్యప్రదేశ్ లో ఉన్న రత్లామ్ మహాలక్ష్మి ఆలయం. ఇక ప్రతి రోజు కూడా ఈ దేవాలయం భక్తులతో చాలా రద్దీగా ఉంటుంది. అమ్మవారికి నగలు, కొన్ని కోట్ల రూపాయలు, వెండి ఆభరణాలు ఇలా అన్ని సమర్పించుకుంటూ ఉంటారట భక్తులు. అయితే అలా అమ్మవారికి ఇచ్చిన వాటిని ఆ దేవత వాటిని మూడు రెట్లు రెట్టింపు చేస్తోందని నమ్ముతారు అక్కడి భక్తులు.అది కూడా రెండింతలు రెట్టింపు అవుతుందని అక్కడివారి నమ్మకం ఈ ఆలయానికి కుబేరుని నిధిగా పేరు ఉన్నది.

The temple that offers gold offerings
The temple that offers gold offerings

దీపావళి సందర్భంగా ఈ ఆలయంలో కేవలం నాలుగు రోజుల పాటు కొన్ని దినోత్సవాలు జరుపుతూ ఉంటారు. పూలతో కాకుండా భక్తులు సమర్పించే ఆభరణాలు డబ్బులతోనే వాటిని అలంకరిస్తూ ఉంటారు. అదేవిధంగా భక్తులు ఆలయాన్ని దర్శించుకున్న తరువాత తిరిగి వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో కాకుండా భక్తులకు బంగారం , వెండి, డబ్బులు వంటి వాటిని ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే ఈ అమ్మవారి కానుకలు ఇచ్చేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుందట. అందుకే వాటిని భక్తులకు పంచిపెడుతూ వుంటారు.