Financial Problems : అందమైన రంగులతో మనసుకు ఆహ్లాదాన్ని అందించే పక్షులలో నెమలి కూడా ఒకటి.. నెమలి మన జాతీయ పక్షి కూడా. నెమలి వ్యక్తి యొక్క జీవితంలో ఆర్థిక సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఎవరైనా సరే వ్యాపారం లేదా ఉద్యోగం చేస్తున్న వారు తమ కార్యాలయాల్లో మీరు కూర్చునే ప్రదేశంలో పక్కనే నెమలి ఈకలను ఉంచడం వల్ల ఆ ప్రాంతానికి అందం పెరగడంతోపాటు నెగిటివ్ ఎనర్జీ కూడా దూరం అవుతుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం నెమలిని పవిత్రంగా భావిస్తారు.. నెమలి ఈకలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. ముఖ్యంగా పూజామందిరంలో నెమలి ఈకలను పెట్టుకున్నట్లైతే ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
నెమలి ఈకలను తరచూ ఆధ్యాత్మిక ,తాత్విక నివారణలో కూడా ఉపయోగిస్తారు. వీటిని పెట్టుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. నెమలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం కాబట్టి ఇంట్లో పెట్టుకున్నట్లైతే స్వామివారి అనుగ్రహం మన కుటుంబం పై పడుతుంది. ముఖ్యంగా నెమలి ఈకలను పూజగదిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటం వుంటే అక్కడ వుంచి పూజించవచ్చు. శనీశ్వర దోషంతో బాధపడుతున్నట్లయితే 3 నెమలి ఈకలను ఒక నల్ల తాడుతో కట్టి అందులో కొద్దిగా నీరు పోసి ఆ నీటిని ప్రతి రోజూ పిచికారి చేస్తూ 21సార్లు శని స్తోత్రాన్ని ఉచ్చరించాలి. ఇలా చేయడంవల్ల శనిదోషం తొలగిపోతుంది.
ఇంట్లో సంపద పెరగాలి అంటే డబ్బు దాచి పెట్టుకునే బీరువా లో నెమలి ఈకలను ఉంచాలి.మీ సంపద ఎక్కువకాలం నిల్వ ఉండటంతో పాటు ధనం కూడా మీ ఇంటికి చేరుతుంది .అంతే కాదు ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ కూడా బయటకు పోయి ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయి. ఇకపోతే వాస్తు దోషాలు ఉన్నట్లయితే ఇంట్లో నెమలీకలు పెట్టి తెల్లటి తాడుతో కట్టి ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని పూజ గదిలో ఉంచి జపించాలి.. ఇలా జపించడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో ధన సంపద పెరుగుతుంది