Ugadi : వామ్మో ఉగాది పచ్చడి అందుకే తినాలా..?

Ugadi : మరి రెండు రోజుల్లో దక్షిణ భారతదేశం ఎంతో ఘనంగా జరుపుకునే ఉగాది పండుగ రాబోతోంది. ఉగాది రోజున పంచాంగం వినడం తో పాటు పచ్చడి కూడా ఖచ్చితంగా తినాలి అని శాస్త్రం చెబుతోంది.. ఉగాది అనగానే మనకు ఉగాది పచ్చడి గుర్తుకొస్తుంది.. ఇది షడ్రుచుల సమ్మేళనం కాబట్టి తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు చేదు అనే ఆరు రకాల రుచులు కలిగినదే ఉగాది పచ్చడి. ముఖ్యంగా ఉగాది పచ్చడి శాస్త్రం ప్రకారం ఎందుకు తినాలి అంటే జీవితంలో ఎదురయ్యే మంచి చెడులను..

కష్ట సుఖాలను ఒకేరకంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మానవాళికి అందిస్తుంది.దేవుడికి నైవేద్యం పెట్టడంతోపాటు ఉగాది పచ్చడి కూడా పెట్టాలి అయితే ఉగాది పచ్చడి తయారుచేయడానికి వేపపువ్వు, మామిడి కాయలు, చింతపండు, ఉప్పు పచ్చి మిరపకాయలు, బెల్లం ఉపయోగిస్తారు. ఇక ఈ పచ్చడిలో కలిపే ఆరు రుచులు.. ఒక్కో రుచికి ఒక్కో అర్థం ఉండడమే కాకుండా ఆరోగ్యప్రయోజనాలు కూడా కలుగుతాయి. కాలం మారే కొద్దీ వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో ఈ ఉగాదిపచ్చడి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇకపోతే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అంటే..

Is that why you should eat Vammo Ugadi Pachadi
Is that why you should eat Vammo Ugadi Pachadi

వేప పువ్వు : వేప రోగనిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. రుతువుల్లో వచ్చే మార్పుల కారణంగా చిన్న పిల్లలకు కలరా , మలేరియా, ఆటలమ్మ , తట్టు వంటి రోగాలను తట్టుకోవడానికి శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా వేపాకులను గుమ్మానికి కట్టడం వల్ల స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి ప్రవేశిస్తుందని.. పైగా రక్తాన్ని శుద్ధి చేసే లక్షణం ఉంది కాబట్టి ఉగాది పచ్చడిలో ఉపయోగిస్తారు.

బెల్లం : ఔషధ గుణాలు మెండుగా ఉండి.. బెల్లం ఆయుర్వేదం ప్రకారం చాలా మందులను ఉపయోగిస్తారు. ఐరన్ సమృద్ధిగా ఉండడం వల్ల గర్భిణీ స్త్రీలు బెల్లం తింటే రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. అజీర్తి, పొడి దగ్గు లాంటివి దూరం అవుతాయి.

చింతపండు : పులుపు తినడం వల్ల ఆలోచన శక్తి మరింత పెరుగుతుంది అని.. మనం కూడా సన్మార్గంలో నడుస్తామని శాస్త్రం చెబుతోంది.. మానసిక ఒత్తిడి దూరం అవడంతో పాటు వేసవిలో వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది. చింతపండు మనలో చింతను దూరంచేసి మానసిక అనారోగ్యాన్ని దూరం చేస్తుంది.

పచ్చిమిర్చి : కారం.. కండరాలు , తలనొప్పి, కండరాల నొప్పులను నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ముఖంపై మొటిమలు తగ్గించడానికి యాంటీబయటిక్ గా పనిచేయడమే కాదు అధిక వేడిని తగ్గించడం లో మొదటి పాత్ర వహిస్తుంది.

ఉప్పు : మానసిక , శారీరక రుగ్మతలను తగ్గించి మేథోశక్తిని పెంచుతుంది. ఉప్పు శరీరం డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది . అలాగే ఫంగల్, ఇన్ఫెక్షన్లు బ్యాక్టీరియల్ వంటి సమస్యలను దూరం చేస్తుంది.