Akshaya Tritiya : అక్షయ తృతీయ రోజు వీటిని దానం చేస్తే సంపద పెరుగుతుందట..!!

Akshaya Tritiya : అక్షయం అంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అర్థం. ఇక అలాంటి అక్షయ తృతీయ రోజు మనం కొన్నింటిని దానం చేయడం వల్ల తీర్థయాత్రలు చేసినంత పుణ్యం లభించడంతో పాటు సంపద కూడా పెరుగుతుంది. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు శ్రీమహావిష్ణువును అలాగే లక్ష్మీదేవిని కలిపి పూజించడం వల్ల శాస్త్రోక్తంగా మంచి జరుగుతుంది అని సమాచారం. ఇక ప్రతి సంవత్సరం వైశాఖ మాసం, శుక్లపక్ష తృతీయ నాడు అక్షయ తృతీయను హిందువులు జరుపుకుంటారు.ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , కర్ణాటక , తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ వంటి ప్రాంతాలలో ఎక్కువగా అక్షయ తృతీయ ను జరుపుకుంటారు.

మే 3వ తేదీన అక్షయ తృతీయ వస్తోంది కాబట్టి ఈ రోజున మహావిష్ణువు , లక్ష్మీ దేవత లను ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా పూజిస్తారు. వివాహాది శుభకార్యాలకు అనువైన రోజుగా పరిగణిస్తారు. అక్షయ తృతీయ రోజు ఏ సమయంలో ఏ పని మొదలు పెట్టినా దిగ్విజయంగా పూర్తవుతుందట. అంతేకాదు ముహూర్త ఘడియలను చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదని పండితులు చెబుతున్నారు. ఇక అక్షయ తృతీయ రోజున జల దానం చేయడం వల్ల అన్ని తీర్థయాత్రలు చేసినంత పుణ్య ఫలం లభిస్తుందట.అసలే ఎండాకాలం పైగా దాహం కూడా ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరికి నీటి దానం చేయడం

If you donate these on the third day of Akshaya Tritiya wealth will increase
If you donate these on the third day of Akshaya Tritiya wealth will increase

వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందట. అంతేకాదు సిరిసంపదలకు లోటు ఉండదు అని.. తీర్థయాత్రలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా నీటితో నిండిన కుండలను దానం చేస్తే అన్ని తీర్థయాత్రలు తిరిగి వచ్చి నంత పుణ్యం లభిస్తుందట. అంతేకాదు జంతువులకు , పక్షులకు దానం వేయడంతో పాటు వాటి దాహాన్ని కూడా తీరిస్తే చాలా మంచిదట. అంతేకాదు మట్టి కుండలో నీటిని నింపి.. ఆ నీటి సహాయంతో మొక్కలను నాటడం వల్ల కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికీ ఇలాంటి సమాచారం అందించడం కోసం వాట్సప్ లేదా ఫేస్బుక్ ద్వారా ఈ ఆర్టికల్ ని షేర్ చేయండి.