అమ్మవారికి పెట్టిన చీరలను మనం ధరిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

భారతీయ సాంప్రదాయం ప్రకారం మనం ఏదైనా అమ్మవారి గుడి కి వెళ్ళినప్పుడు అక్కడ మనం కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తూ వస్త్రాలను సమర్పిస్తూ ఉంటాము. అందులో చాలా ప్రత్యేకమైనది అమ్మవారి చీర. అయితే ఆ అమ్మవారికి పెట్టినటువంటి చీరకు ఎంతో విశిష్టత ఉందని చెప్పవచ్చు. మరి ఆ విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మనం ఏదైనా దేవుళ్ళకు.. వస్త్రాలను కట్టి తీసివేసిన తర్వాత వాటిని .. శేష వస్త్రాలు అంటారు. శేషము అంటే మిగిలినదని అర్థము. అంటే వాళ్లు ధరించిన తరువాత మిగిలినది ప్రసాదం లాంటిదని అర్థం. అయితే ఈ వస్త్రాలను మూడు రకాలుగా మనం కట్టుకోవచ్చు. అందులో ఒకటి షాప్లో కొనుక్కుని కట్టుకోవడం,

మరొకటి ఎప్పుడైనా కొత్తబట్టలు దేవుని దగ్గర పెట్టి తీసుకోవడం,మరొకటి స్వామివారికి కట్టినటు వంటి బట్టలను మనం ధరించడం. మరి ఇలాంటి వస్త్రాలను మనం కట్టుకోవచ్చా.. కట్టుకుంటే ఏమవుతుంది అనేది తెలుసుకుందాం.ముఖ్యంగా ఇలాంటి వస్త్రాలను వేలంలో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. వచ్చిన డబ్బులతో ఆ గుడి బాగోగులను చేయిస్తూ ఉంటారు కొంతమంది పెద్దలు. కానీ అలా వేసిన డబ్బులు మాత్రం.. సొంత పనికి ఉపయోగించుకుంటే చాలా పాపమని పురాణాలు తెలియజేస్తున్నాయి. మరి కొన్ని దేవాలయాలలో కొన్ని వస్తువులను ఆన్లైన్ ద్వారా అమ్ముతూ ఉంటారు.

follow these rules if women wears godessess clothes
follow these rules if women wears godessess clothes

మనం ఇలాంటి వస్తువులను ఏదైనా పుణ్య కార్యాలు, పూజలు చేసేటప్పుడు మాత్రమే ధరించాలి అని పండితులు తెలియజేస్తున్నారు. ఇలా ధరించడం వల్ల మనకు చాలా మంచిదట. అలాగే కొన్ని సమయాలలో ఇలాంటి బట్టలను మనం ఉపయోగించకూడదు. ఎవరైనా ఇంట్లో మరణిస్తే వాటిని దూరంగా పెట్టి.. కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత వాటి మీద ఆవు పంచితం చల్లి.. తీసుకోవాలి. ఒకవేళ ఈ వస్త్రాలను కట్టుకొని మళ్ళీ తీసి వేయాలి అంటే.. వాటిని ఏదైనా పారేటువంటి గంగాజలంలో ఉతికితే చాలా మంచిదట.ఇలాంటి విషయాలన్నీ ఎక్కువగా ప్రకృతితో సంబంధించి ఉంటాయి. అందుచేత ఎక్కువగా ఇలాంటి వస్త్రాలను ఇ ల్లల్లో ఉంచుకోకుండా దేవాలయాలు లోనే ఉంచుతూ ఉంటారు.