Lemon : నిమ్మకాయతో ఇలా చేస్తే.. ధనవంతులు అవ్వడం ఖాయం..!!

Lemon : నిమ్మకాయ ఇంట్లో ఉంటే వాస్తు దోషం పోతుందని చాలాసార్లు వినే ఉంటాము. మనం నిమ్మకాయని రెగ్యులర్ గా ఉపయోగిస్తూ ఉంటాము. ఆరోగ్య విషయంలోనే కాకుండా.. ఆధ్యాత్మిక పరిణామాలలో కూడా వాడతారు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నిమ్మకాయల కు నెగటివ్ ఎనర్జీ ని తొలగించే.. అతీత శక్తులు ఉన్నాయని చాలా మంది నమ్మకం. ఎంతోమంది వ్యాపారస్తులు దగ్గర కూడా నిమ్మకాయలను ఒక గ్లాసులో నీటిని పోసి అందులో ఉంచుతూ ఉంటారు. అయితే ఇలా చేయడానికి గల కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.నిమ్మకాయతో అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు అని అంటుంటారు మన పూర్వీకులు.

వ్యాపారుల నుండి దుష్టశక్తులు రాకుండా నిమ్మపండు కాపాడుతూ ఉంటుందని ఇప్పటికీ ఎంతోమంది నమ్ముతూ ఉంటారు. మంత్ర తంత్రాలను దూరం చేసే అతీత శక్తులు నిమ్మకాయలో ఉంటాయని భావిస్తారు. అలాగే గురువారం రోజున హనుమంతుడు గుడికి వెళ్లి.. నాలుగు నిమ్మకాయలను, లవంగాలను తీసుకెళ్లి పూజ చేయడం ద్వారా కష్టాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఇక వ్యాపారం సరిగా జరగకపోతే ఒక నిమ్మకాయ తీసుకొని .. షాపులో ని నాలుగు మూలల ఆ నిమ్మకాయను కోసి , నాలుగు దిక్కుల ఆ నిమ్మకాయ ఉంచుతారు.ఇక నిమ్మచెట్టు ఇంటి ఆవరణంలో ఉండడం వల్ల ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఉండదు. ఇంటి వాస్తు విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా నిమ్మచెట్టు ఉండడం వల్ల వాస్తు సెట్ అవుతుందట.

Doing this with lemon fruit is sure to make you rich
Doing this with lemon fruit is sure to make you rich

ఇంట్లో ఎవరికైనా దిష్టి దోషం తగిలితే.. తగిలిన వ్యక్తికి కింద నుండి పై వరకూ నిమ్మకాయతో దిష్టి తీసి బయటకు పారేయాలి. అలా పడేసిన తరువాత వెనక్కి తిరిగి చూడకుండా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆ దిష్టి పూర్తిగా పోతుందట. నిమ్మకాయను గాజు నీటిలో కోసి వేయడం వల్ల చెడు దృష్టి ని పోగొట్టి.. మంచిని గ్రహిస్తుందట. ఇక అంతే కాకుండా అక్కడ ఉండే పరిసరాలను అనుకూలంగా మారుస్తుందట. ఇవి కేవలం వ్యాపార ప్రాంతాల్లోనే కాకుండా ఇంట్లో కూడా ఇలాంటివి చేయవచ్చు. మీ ఇంట్లోని హాలులో గాజు గ్లాసులో నీటిని తీసుకొని అందులోని నిమ్మ పండును వేయడం వల్ల కుటుంబంలో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.