Tummi Flowers : ఈ చెట్టు పూలతో శివుడిని పూజిస్తే ఏం జరుగుతుందో తెలుసా..!?

Tummi Flowers: ముచ్చటైన తుమ్మి చెట్టును మన ఇంటి చుట్టుపక్కల నిత్యం చూస్తూనే ఉంటాం.. ఈ చెట్టు పూలు తెల్లగా శంఖు ఆకారంలో ఉంటాయి ఈ పువ్వులంటే మహా శివుడికి ప్రీతి.. తుమ్మి పువ్వులతో శంకరుడిని పూజిస్తే సకల అభీష్టాలు నెరవేరుతాయని ప్రతితి.. కార్తీక మాసంలో ఏ చెట్టు పూలతో విశేష పూజలు చేస్తారు అన్ని శివాలయాలలో.. ఈ చెట్టు పూలలో ఉండే ఔషధ గుణాలు ఉన్నాయి.. వాటి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..!?

తుమ్మి పూల రసం 15 చుక్కలు, తేనె 15 చుక్కలు కలిపి తీసుకుంటే దాహార్తి, నీరసం, అలసట తగ్గుతాయి. వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తుంది. డీహైడ్రేషన్ బారీన పడకుండా చేస్తుంది వేసవిలో ప్రతి నిత్యం తీసుకుంటే ఈ సీజన్లో వచ్చే అనేక రకాల సమస్యలను నివారిస్తుంది. 25 తుమ్మి పూలు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక గ్లాస్ పాలను తీసుకొని అందులో ఈ పూలను వేసి ఒక గంట పాటు నానబెట్టాలి. ఇలా పూలను నాన బెట్టిన ఈ పాలను పిల్లల చేత తాగిస్తే గొంతులో గరగర తగ్గుతుంది.

Do you know what happens if you worship Shiva with Tummi tree Flowers
Do you know what happens if you worship Shiva with Tummi tree Flowers

అంతేకాకుండా గొంతు సమస్యలు రాకుండా చేస్తుంది.తుమ్మి పువ్వులు వగరుగా ఉంటాయి. ఇవి జలుబు ను తగ్గిస్తాయి. ఈ పువ్వుల కషాయం తయారుచేసుకొని తాగితే జలుబు దగ్గు పడిశం జ్వరం తగ్గిస్తుంది వీటి నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది అంతేకాకుండా మహిళల్లో వచ్చే నెలసరి సమస్యలను ఈ పూల కషాయం చెక్ పెడుతుంది. స్త్రీలలో పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. ఆ సమయంలో వచ్చే చిరాకు, అలసట ను తొలగిస్తుంది.