Tuesday : ఎట్టి పరిస్థితుల్లో కూడా మంగళవారం ఇలా చేయకండి.. ఒకవేళ చేస్తే..!!

Tuesday  : ప్రతి రోజుకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. హిందూ శాస్త్రం ప్రకారం జ్యోతిష్య శాస్త్రం లో వచ్చే ప్రతి విషయాన్ని కూడా మనం తప్పకుండా ఆచరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ముఖ్యమైన రోజుగా అంగారక గ్రహానికి సంబంధించిన రోజుగా పరిగణిస్తారు. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహం , శక్తికి ధైర్యానికి చిహ్నంగా పరిగణిస్తారు. మంగళవారం ఆంజనేయుడు కి అంకితం చేయబడింది. శ్రీరాముడి భక్తుడైనా హనుమంతుడిని పూజించడం వల్ల సకల రోగాలు తొలగిపోతాయి… ధైర్యం పెరుగుతుంది అని భక్తుల ప్రగాఢ నమ్మకం.

బజరంగబలి కలియుగ దేవుడు గా ఇప్పటికీ భూమిపై ఉన్నాడు అని పండితులు చెబుతుంటారు. ఇంతటి గొప్ప రోజున మనం కొన్ని పనులు అసలు చేయకూడదు. ఇక అలాంటి వాటి గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం రోజున ఎవరికి ఎలాంటివి అప్పుగా ఇవ్వకూడదు . ముఖ్యంగా డబ్బు విషయంలో ఈ విషయాన్ని తప్పకుండా ఆచరించాలి. ఎవరికైనా డబ్బును అప్పుగా మంగళవారం రోజు ఇస్తే తిరిగి రావడానికి ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది. ఇక ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నా కూడా ఆ డబ్బు తిరిగి ఇవ్వడానికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. ఇక డబ్బుకు సంబంధించిన ఎలాంటి కొత్త పని కూడా మొదలు పెట్టకూడదు. అంతేకాదు పదునైన వస్తువులను కొనకూడదు.

Do not do this Tuesday under any circumstances
Do not do this Tuesday under any circumstances

మంగళవారం రోజున ఉపవాసం పాటించేవారు ఉప్పు తినకూడదు. మంగళవారం రోజున పడమర, ఉత్తర దిశ వైపు ప్రయాణం మానుకోవాలి .మంగళవారం రోజు బెల్లం తిన్నట్లయితే ఎటువంటి సమస్యలు తలెత్తవు.యాగాలు, హోమాలు, యజ్ఞాలు వంటి వాటికి మంగళవారం రోజు దూరంగా ఉండాలి. ఇక తెలుపు రంగు లేదా పాలతో తయారుచేసిన పదార్థాలను కొనుగోలు చేయకూడదు. అలాగే ఇంట్లో కూడా తయారు చేయకూడదు. మంగళవారం రోజు ఇనుప వస్తువులు కొనుగోలు చేయడం వల్ల జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికీ అవసరమయ్యే ఇలాంటి ఆర్టికల్స్ ను వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా అందరికీ షేర్ చేయండి.