Anemia : రక్తహీనత సమస్యను దూరం చేసే ఎండు ద్రాక్ష..!!

Anemia : సాధారణంగా ఆరోగ్యాన్ని పెంపొందించే ఎన్నో పోషక పదార్థాలు కలిగి ఉన్నవాటిలో ఎండుద్రాక్ష కూడా ఒకటి. ముఖ్యంగా పోషకాలు ఎండుద్రాక్షలో అధికంగా లభిస్తాయి . ఇక ఎండిన ద్రాక్ష పండ్లనే మనం ఎండు ద్రాక్ష అని పిలుస్తాము. ఇక ఇవి బాగా తీపిగా కూడా ఉంటాయి. నిజానికి ఎండుద్రాక్షలలో చక్కెర శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో ఎండుద్రాక్షలను రకరకాల పేర్లతో పిలుస్తారు. ఎండు ద్రాక్ష వల్ల అధిక ప్రయోజనాలు కలుగుతాయి. ఇక ఆరోగ్యాన్ని పెంపొందించే ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

ఎండు ద్రాక్షను ఎక్కువగా తినడం వల్ల జీర్ణక్రియకు చక్కగా సహాయపడుతుంది. ఇక సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఒక్కోసారి జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇక దీని వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఎండు ద్రాక్ష తినడం వల్ల మలబద్దకం సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు. ఇక ఎండు ద్రాక్ష తినడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఎవరైనా బరువు పెరిగి డైట్ చేస్తూ ఉంటే అలాంటి వారు ఎండు ద్రాక్ష తినడం వల్ల బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా ఎండుద్రాక్ష శరీరంలో కొవ్వు పరిమాణాన్ని త్వరగా తగ్గిస్తుంది.

Raisins to stave off anemia
Raisins to stave off anemia

ఇక ఇందులో లభించే సహజ చక్కెర శరీరానికి మంచి శక్తిని కూడా అందిస్తోంది. దీంతో పాటు కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది.ఇక రక్తాన్ని పెంచడంలో కూడా ఎండుద్రాక్ష బాగా సహాయపడుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడుతున్నవారు ఎండు ద్రాక్ష తినడం వల్ల రక్తహీనత సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఇక మహిళలు ఖచ్చితంగా తమ డైట్ లో ఒక భాగంగా చేర్చుకోవాలి. ఎముకలు దృడంగా ఉంచుకోవడానికి కూడా ఎండుద్రాక్ష సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రతిరోజు కొన్ని ద్రాక్ష పండ్లు తినడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది . ఎముకలకు కావలసిన కాల్షియం కూడా లభిస్తుంది.