Sani Amavasya: ఆర్థికాభివృద్ధి పెరగాలంటే శని అమావాస్య రోజు ఇలా చేయకండి..!!

Sani Amavasya: ఇక శనివారం ఏప్రిల్ 30వ తేదీ అమావాస్య వచ్చిన నేపథ్యంలో శని అమావాస్య గా పరిగణిస్తున్నారు. మనదేశంలో చాలామంది జాతకాలు, శాస్త్రాలను నమ్ముతూ, వాస్తు శాస్త్రాన్ని పాటిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఏ వస్తువులను ఇతరుల నుంచి తీసుకోవాలి.. తీసుకోకూడదు అన్న విషయంలో కూడా క్లారిటీ గా ముందుకు వెళుతూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే శనీశ్వరుని అనుగ్రహం మన పైన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా శని అమావాస్య రోజున శని ప్రభావం మనపై ఉండకుండా చూసుకోవడానికి.. శనివారం రోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని వస్తువులు ఇంటికి తీసుకు రాకూడదు. ఇక మీ బంధువులకు , స్నేహితులకు ఈ ఆర్టికల్ ను వాట్సాప్ ద్వారా షేర్ చేసి వారిలో అవేర్నెస్ నింపండి.

Sani Amavasya: ఇక ఎలాంటి వస్తువులను  ఇంటికి తీసుకురాకూడదు అనే విషయానికి వస్తే..

ఆవనూనె: శనీశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన ఆవ నూనె ను  మీరు శనివారం కొనుగోలు చేసినట్లయితే ఆవ నూనెతో పాటు శని భగవానుడు కూడా మీ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇలా ఆవ నూనె కొనుగోలు చేయడం వల్ల శారీరక బాధలు, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి శనివారం రోజు  ఆవనూనె కొనుగోలు చేయకండి.. అవసరమైతే శనీశ్వరుడు ముందు ఆవ నూనెతో దీపం పెడితే ప్రయోజనం ఉంటుంది.

ఉప్పు, పప్పులు: లక్ష్మీదేవి స్వరూపమైన ఉప్పును శనివారం రోజు ఇంటికి తెచ్చుకోకూడదు. ఒకవేళ కొనుగోలు చేసినట్లయితే ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే పప్పులను కూడా శనివారం రోజు ఇంటికి తీసుకు రాకూడదు.

చీపురు , చాట : ఇవి రెండూ కూడా శనివారం రోజు ముఖ్యంగా శని అమావాస్య రోజు అసలు కొనుగోలు చేయకూడదు.  లేదా ఇతరుల నుంచి తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నట్లయితే ఆర్థికపరమైన ఇబ్బందులు,  కుటుంబంలో కలహాలు, గొడవలు తలెత్తుతాయి.

ముఖ్యంగా శని అమావాస్య రోజు వీటిని కొనుగోలు చేయకుండా మీరు జాగ్రత్త పడండి.