Yogi Adityanath : ప్రభాస్ ఆదిపురుష్ కి అండగా నిలబడ్డ యోగి ఆదిత్యనాథ్ ? .. ఇప్పుడు ఆపండి రా !

Yogi Adityanath : రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ఆది పురుష్.. టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతార్ , రాజేష్ నాయక్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దర్శకుడిగా ఓమ్ రౌత్ వ్యవహరిస్తున్నారు. ఇక ఇందులో రాఘవుడిగా ప్రభాస్, హనుమంతుడిగా దేవదత్త నాగే, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీనిజార్, జానకిగా కృతి సనన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను విడుదల చేయగా మిశ్రమ స్పందన లభించింది. కొంతమంది రామాయణ పాత్రలను తప్పుగా చూపిస్తున్నారని విమర్శలు చేస్తే..

మరి కొంత మంది సినిమాను అడ్డుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కి, ఆది పురుష్ సినిమాను తెరపై అద్భుతంగా చూపించిన ఓమ్ రౌత్ కి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మద్దతు ఇస్తామని ప్రకటించారు. నిజానికి ఆయనే టీజర్ విడుదల చేయాల్సి ఉంది.. కానీ కొన్ని రాజకీయ పనుల వల్ల ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు ఆదిత్యనాథ్.ఇక త్వరలో ఈ సినిమా ట్రైలర్ ను ఆదిత్యనాథ్ అలాగే ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా విడుదల చేయడానికి సన్నహాలు సిద్ధం చేస్తున్నారు. ఆది పురుష్ సినిమా ఆపేస్తామని తెలిపిన వారికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అండగా నిలబడడంతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా మద్దతు ప్రకటించారు.

Yogi Adityanath stood by Prabhas Adipurush
Yogi Adityanath stood by Prabhas Adipurush

మరొకవైపు మహారాష్ట్ర లో ఈ సినిమాను ఆపేస్తామని ప్రకటించిన కొంతమంది నాయకులకు వ్యతిరేకంగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన కూడా మద్దతు ప్రకటించింది . ఇక దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ సినిమాలు ఆపివేయాలని కొంతమంది చెత్త వాగుడు వాగిన వారికి అడ్డుకట్ట వేస్తూ ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా ఈ సినిమాకు మద్దతు ప్రకటిస్తున్నారు. అంతేకాదు ఏదో టీజర్ ని చూసి కుటిల కుతంత్రాలు చేయడం ఆపాలని , సినిమా విడుదలైన తర్వాత సినిమా చూసి ఎలా ఉందో చెప్పాలి అని కూడా వారు తెలియజేస్తున్నారు. ఇక ఆదిపురుష్ సినిమాకి పెరుగుతున్న మద్దతు చూస్తుంటే కచ్చితంగా ఈ సినిమా శత దినోత్సవాన్ని కూడా జరుపుకుంటుంది అని కూడా చెప్పవచ్చు.