Taraka Ratna: నందమూరి తారక రత్న టిడిపి యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర లో గురువారం నడుస్తూ తారకరత్న సొమ్మసిల్లి పడిపోవడం.. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా వైద్యులు గుండెపోటుగా నిర్ధారించడం.. ఆ తరువాత తారకరత్న కు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకువెళ్లారు. శుక్రవారం రాత్రి ఆయన భార్య అలేఖ్య రెడ్డి, కుమార్తె ఆసుపత్రికి వచ్చారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హాస్పిటల్ కి వచ్చారు కానీ.. నందమూరి తారకరత్న కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటికే హాస్పిటల్ కి చేరుకోలేదట..
అంబులెన్స్ లో బాలకృష్ణ, అలేఖ్య రెడ్డి బెంగళూరుకి తీసుకువెళ్ళారు. అక్కడ డాక్టర్లతో పాటు అందరితో చర్చించి తరువాత వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా తారకరత్నతో భార్య అలేఖ్యరెడ్డి నే తుది నిర్ణయం తీసుకున్నారట. ఇంత జరుగుతున్నా తారకరత్న ఆరోగ్యం గురించి ఆయన తండ్రి నందమూరి మోహనకృష్ణ పట్టించుకోవడంలేదని టాక్ వినిపిస్తోంది. తారకరత్న ఆరోగ్యం గురించి మోహనకృష్ణ పట్టించుకోవడం లేదంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి .
నందమూరి తారకరత్న మోహనకృష్ణ గత కొంతకాలంగా తారకరత్నకు దూరంగా ఉంటున్నారు. తారకరత్న కుటుంబానికి ఇష్టం లేని ప్రేమ పెళ్లిని చేసుకున్న కారణంగా మోహన్ కృష్ణ కుటుంబ సభ్యులు తారకరత్నను దూరం పెట్టారు. తారకరత్న ఇంట్లో వారికి ఇష్టం లేకుండా అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. అయితే అలేఖ్య రెడ్డికి ఇది రెండో వివాహం. అందువలన ఇంట్లో వాళ్ళందరూ తారకరత్న దూరం పెట్టారు. ఆ కారణంగానే తారకరత్న ఇప్పుడు గుండెపోటు వచ్చి హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నా కానీ ఆయనను చూసేందుకు మోహన్ కృష్ణ కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి వెళ్ళలేదు అంటూ ప్రచారం జరుగుతోంది .
మోహనకృష్ణ కు ఈ విషయం తెలిసిన వెంటనే తారకరత్నను చూడడానికి రమ్మంటే తనకి ఫోన్ చేసినా నందమూరి కుటుంబ సభ్యులకు మొహం మీదే రాను అని చెప్పేసారని అయితే మోహన కృష్ణ ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా నందమూరి తారకరత్నను హాస్పటల్ కి వెళ్లి చూశారట అంతే కాకుండా తన హెల్త్ కండిషన్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటున్నారని మరో సమాచారం కూడా వినిపిస్తోంది ఎంత కాదనుకున్నా ఆయన తన కొడుకు ఆ ప్రేమతో నైనా హాస్పిటల్ కి వచ్చి చూసి ఉంటారని అంతా అనుకుంటున్నారు ఇలాంటి సమయంలో పట్టింపులు కాదని కొడుకే ముఖ్యమని మరో వాదన కూడా వినిపిస్తోంది.