Taraka Ratna: నందమూరి తారకరత్న పేరు గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. యువగళం పాదయాత్రలో నందమూరి తారకరత్న పడిపోవడం.. అయినా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు రావడం మనందరికీ తెలిసిందే.. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడిందని త్వరలోనే రికవరీ అవుతారని వైద్యులు చెబుతున్నారు. దాంతో నందమూరి తారకరత్న పర్సనల్ లైఫ్ గురించి నేటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు . అందులో భాగంగా అలేఖ్య రెడ్డి గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి..
తారక రత్న అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అలేఖ్య రెడ్డికి తారకరత్నతో మొదటి వివాహం కాదట. ఆమెకు అంతకుముందే మరో వివాహం జరిగింది. అలేఖ్య మొదటి వివాహాన్ని టిడిపి మాజీమంత్రి ఎలిమిరెడ్డి మాధవరెడ్డి కుమారుడు సందీప్ రెడ్డి తో జరిగింది .
సందీప్ రెడ్డిని పెళ్లి చేసుకున్న కొంతకాలం తరువాత అలేఖ్య రెడ్డికి తన భర్తకి వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురయ్యాయి. దాంతో ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. దాంతో అలేఖ్య రెడ్డి కొంతకాలం వంటరిగా ఉంది.
ఆ తరువాత నందమూరి తారకరత్న నందీశ్వరుడు సినిమాలో ఆమె కాస్టింగ్ డిజైనర్ గా పనిచేశారు. వారిద్దరి మధ్య ఏర్పడిన ప్రేమ పెళ్లి వరకు తీసుకెళ్లింది. తారకరత్న కుటుంబ సభ్యులను ఎదిరించి అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. 2012లో ఆగస్టు 2వ తేదీన సంఘీ టెంపుల్లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. తారకరత్న, అలేఖ్య రెడ్డికి ఒక కొడుకు కూడా ఉన్నారు.