Varun Tej-Niharika : నిహారిక విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్న వరుణ్ తేజ్.. ఏమైందంటే..? 

Varun Tej-Niharika :  మెగా డాటర్ గా గుర్తింపు తెచ్చుకున్న నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వ్యాఖ్యాతగా, నటిగా, నిర్మాతగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె వివాహం అనంతరం కొంతవరకు వివాదాలలో చిక్కుకుందని చెప్పాలి. ర్యాడిసన్ బ్లూ పబ్బులో డ్రగ్స్ కేసులో ఇరుక్కొని మరింత అవమానాలకు గురి అయిన ఈమె.. ఆ తర్వాత జిమ్ కోచ్ తో జిమ్ సెంటర్లో చేసిన కొన్ని పనుల వల్ల అత్తవారి చేత కూడా పూర్తిస్థాయిలో చివాట్లు పడింది. అంతేకాదు తన ఇన్ స్టా గ్రామ్ ని సైతం డిలీట్ చేసింది నిహారిక. అయితే ప్రస్తుతం అంతా సద్దుమణిగిన తర్వాత వెకేషన్ లను ఎంజాయ్ చేస్తూ తనకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ మరింతగా పాపులారిటీని దక్కించుకుంటుంది.

Varun Tej taken serious decision on Niharika matter.
Varun Tej taken serious decision on Niharika matter.

ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నిహారిక విషయంలో వరుణ్ తేజ్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలిసిన తర్వాత అభిమానుల సైతం ఒక అన్నగా.. చక్కగా బాధ్యతలు నెరవేరుస్తున్నావు అంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. వివాహం జరిగిన తర్వాత నిహారిక మరింత గ్లామరస్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే తన భర్త కూడా ఆమెకు దూరమయ్యాడు అంటూ వార్తలు వినిపించాయి. కానీ తన భర్తతో కలిసి దిగిన ఫోటోను ఆమె షేర్ చేయడంతో మళ్లీ వార్తలకు పులిస్టాప్ పడింది. కానీ కొన్ని రోజుల తర్వాత తన భర్తను దూరం పెట్టిందంటూ వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం. అంతేకాదు చైతన్య జొన్నలగడ్డ నిహారిక తో ఫ్యామిలీ ఫంక్షన్లో కూడా కనిపించట్లేదట.

ఇంట్లో పెద్ద వాళ్లకు తెలియకుండా వీరిద్దరూ వేరే వేరే ఇళ్లలో ఉంటున్నారని సమాచారం. పైగా సోషల్ మీడియాలో కూడా తన భర్త ఫోటోలను పంచుకోకపోవడంతో అందరికీ అనుమానాలు వస్తున్నాయి. ఈ విషయంపై ఫ్యామిలీకి కూడా తెలియకపోవడంతో తన అన్నయ్య వరుణ్ తేజ్ ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. అంతేకాదు ఇంటికి పిలిపించి మరి..” ఇలాంటి పనులు చేసే ముందు పెద్దవారితో మాట్లాడాలి.. అంతే కాని మీ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోకూడదు. పెద్దవారితో మాట్లాడి పరిష్కరించుకోవాలి. కానీ వేరుగా ఉండడం మంచిది కాదు.. ఇకపై నువ్వు ఎప్పుడూ నీ భర్తతోనే ఉండాలి.. అలా చూసుకునే బాధ్యత నాది.. ఇదే నా నిర్ణయం ” అంటూ ఈ నిర్ణయం తీసుకున్నారట వరుణ్ తేజ్. మొత్తానికైతే చెల్లి విషయంలో వరుణ్ తేజ్ తీసుకున్న బాధ్యత చూసి ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు . కానీ టాలీవుడ్ లో ఈ విషయం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.