Guppedanta Manasu 09 Nov Episode : వసుధర యూనివర్సిటీ టాపర్ అయినందుకు జగతిని అమ్మ అని రిషి పిలుస్తాడా.!?అజ్ఞాతవాసం ముగుస్తుందా.!?

Guppedanta Manasu 09 Nov Episode : వసుధర కాలేజ్ కి వెళ్తుంది. రిజల్ట్స్ వచ్చాయని అందరూ నోటీస్ బోర్డ్ దగ్గర నుంచుని ఉండరు. పుష్ప నా నెంబర్ చూడు అని వసుధార అంటుంది. నీ నెంబర్ లేదు వసుధార అని పుష్ప చెబుతుంది.. అదేంటి వసుధార ఇలా జరిగింది అని పుష్ప అడుగుతుంది.. వసుధర అక్కడి నుంచి మౌనంగా వెళ్లి మెట్లు మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రీషిని చూస్తూ సార్ నేను ఫెయిల్ అయ్యాను అని వసుధార ఏడుస్తుంది.

guppedanta-manasu-09-nov today full -episode
guppedanta-manasu-09-nov today full -episode

అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాను సార్.. నేను ఓడిపోయాను సార్ అని వసుధర ఏడుస్తుంది. రిషి తనని చూస్తూ కూల్ గా కంగ్రాట్స్ వసుధార అని విష్ చేస్తాడు.. ఏంటి సార్ మీరు ఫెయిల్ అయినా కూడా కంగ్రాట్స్ చెబుతారా అని వసుధారా అంటుంది. నువ్వు ఫెయిల్ అయ్యావ్ అని ఎవరు చెప్పారు వసుధరా అని రిషి అంటాడు. నోటీసు బోర్డులో నా నెంబర్ లేదు కదా సార్ అని వసుధార అంటుంది. కంగ్రాట్స్ వసుధార నువ్వు యూనివర్సిటీ టాపర్ వి.. యూనివర్సిటీ టాపర్ నెంబర్ నోటీసు బోర్డులో ఉండటం కరెక్ట్ కాదు అని అనిపించింది. అయినా ఈ విషయాన్ని నేనే నీతో చెప్పాలి అని అనిపించింది. అందుకే నోటీస్ బోర్డ్ లో నీ నెంబర్ ఉంచలేదు అని రిషి అంటాడు. వసుధర ఆనందంతో ఎగిరి గంతులు వేస్తుంది. రిషిని పట్టుకుని గిరగిరా తిప్పేస్తుంది.

ఈ సంతోష సమయంలో జగతి మేడం ఉంటే చాలా బాగుంటుంది కదా సార్ అని వసుధర గుర్తు చేసుకుంటుంది. తను ఎక్కడ ఉన్నా నీ విజయాన్ని తెలుసుకుని సంతోషిస్తారు అని రిషి అంటాడు. బ్యాడ్ కూడా ఈ సమయంలో ఉంటే బాగుండేది అని రిషి మనసులో అనుకుంటాడు అప్పుడే గౌతమ్ వచ్చి కంగ్రాట్స్ వసుధార అని చెబుతారు. ఇక కాలేజీలో మిగతా వాళ్ళందరూ కూడా వసుధారని విష్ చేస్తారు.. అందరూ యూనివర్సిటీ టాపర్ అంటూ వసుధారని విష్ చేస్తున్న అందర్నీ గౌతమ్ వీడియో తీస్తాడు. ఆ వీడియో చూసిన ధరణి దేవయాని దగ్గరకు వచ్చి మేడం వసుధర యూనివర్సిటీ టాపర్ అయింది అని వీడియో చూపిస్తుంది. దాంతో దేవయాని ధరణిపై విసుక్కుంటుంది.

గౌతమ్ ఆ వీడియో ను జగతి, మహేంద్ర కు చూపిస్తాడు.. వసుధర సాధించింది మహేంద్ర మన నమ్మకం నిలబెట్టింది అని జగతి అంటుంది. నువ్వు గ్రేట్ వసు సాధించావు అని అంటుంది. అచ్చం మీకు లాగానే రిషి అన్నాడు. తను ఎవరీ కొడుకు ఈ మహేంద్ర భూషణ్, జగతిల కొడుకు అలా కాకపోతే ఇంకెలా అంటాడు అని మహేంద్ర అంటాడు. అప్పుడే జగతి రిషి నా కొడుకు గౌతమ్ అని చెబుతుంది. కానీ తన చేత అమ్మ అని పిలిపించుకోలేకపోతున్నాను అంటూ జగతి ఎమోషనల్ అవుతుంది. జగతి బాధపడకు అని మహేంద్ర ఓదారుస్తాడు. ఇంకా ఎన్ని రోజులు అంకుల్ ఈ అజ్ఞాతవాసం అని గౌతమ్ అంటాడు.

యూనివర్సిటీ టాపర్ వసుధర వినడానికి ఎంత బాగుందో అని రిషి అంటాడు.. అవును సార్ చాలా ఆనందంగా ఉంది అని వసుధర అంటుంది. వసుధర నువ్వు ఇప్పుడు ఏం కావాలో అడుగు నీకు ఏం కావాలంటే అది ఇస్తాను అని రిషి అంటాడు. ఏం కావాలన్నా ఇస్తారా సార్ అని వసుధర అడుగుతుంది. నీ ఎదురుగా ఉంది రిష్యేంద్రభూషణ్. నువ్వు ఏమడిగినా కూడా తీరుస్తాను అని రిషి అంటాడు. మీరు జగతి మేడంని అని వసుధర తన మనసులో ఉన్న కోరిక చెప్పేలోపే నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఒకవేళ వసుధర జగతి మేడంని అమ్మ అని పిలవమని అడిగితే.. రిషి పిలుస్తాడా లేదా అనేది తరువాయి భాగంలో చూద్దాం.