Taraka Ratna: నందమూరి తారకరత్న నిన్న యువగళం పాదయాత్రలో స్పృహతాపి పడిపోయారు. వెంటనే హాస్పటల్ కు తరలించారు.. అక్కడి నుంచి నందమూరి తారకరత్న బెంగళూరుకు మెరుగైన వైద్యం కోసం తీసుకువెళ్లారు. తారకరాత్న ఆరోగ్యానికి సంబంధించి అప్డేట్ వచ్చింది..
నందమూరి తారకరత్న మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ కు తరలించారు. శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక అంబులెన్స్ లో తారకరత్నను బెంగళూరుకు తీసుకువెళ్లారు. శుక్రవారం రాత్రి ఆయన భార్య అలేఖ్య రెడ్డి కుమార్తె ఆసుపత్రికి వచ్చారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తీసుకు వెళ్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో డాక్టర్లతో పాటు అందరితో చర్చించి తారకరత్నతో పాటు ఆయన భార్య అలేఖ్య రెడ్డి, నందమూరి బాలయ్య కూడా బెంగళూరు వెళ్లారు.
కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో చికిత్స అందిస్తూ తారకరత్నను నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకు వెళ్లిన వెంటనే వైద్యులు తగిన వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా వైద్యులు తారకరత్న పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెప్పడంతో.. ఆయన భార్య అలేఖ్య రెడ్డి వెంటనే స్పాట్ లో ఊహించని నిర్ణయం తీసుకున్నారట..
బెంగుళూరులోని చాలా ఫేమస్ టెంపుల్ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో వెయ్యి మంది పురోహితులతో తారకరత్న ఆరోగ్యం కోసం ఆయన పేరు మీద మృత్యుంజయ హోమం చేయిస్తున్నారు అలేఖ్య రెడ్డి. మృత్యుంజయ హోమం చేయిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోయి తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంటుందని భావించినట్లున్నారు అలేఖ్య రెడ్డి. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని ప్రత్యేక ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మనందరం కూడా తారకరత్న త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం.