Srinivasa Murthy: డబ్బింగ్ అంటే కేవలం డైలాగ్ లు చెప్పడం మాత్రమే కాకుండా.. ఎన్నో వేరియేషన్స్ చూపిస్తూ ఈ రంగం లో తనదైన ముద్ర వేశారు శ్రీనివాస మూర్తి. ఎన్నో ఏళ్లుగా డబ్బింగ్ రంగంలో సేవలు అందిస్తున్న ఆయన తెలుగులో సూర్య, రాజశేఖర్, విక్రమ్, అజిత్, మోహన్ లాల్ వంటి ఎంతో మంది స్టార్ హీరోలకు ఆయన డబ్బింగ్ చెప్పారు.. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. సూర్య, విక్రమ్, అజిత్ లకు ఆయన డబ్బింగ్ చెప్పిన సినిమాలు అన్నీ డబ్బింగ్ సూపర్ హిట్ అయ్యింది. కేవలం ఆయన డబ్బింగ్ చెప్పడం వల్లే హిట్ అయిన చిత్రాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.. ఇప్పుడు ఆ సినిమాలెంటో చూడండి..

సింగం సిరీస్, 24:
తమిళ స్టార్ హీరో సూర్య కి తెలుగులో భారీ ఫాలోయింగ్ తీసుకొచ్చిన సినిమాలు సింగం సిరీస్ లు. సింగం సీరీస్ తో పాటు సూర్య నటించిన 24 చిత్రానికి కూడా శ్రీనివాస మూర్తి డబ్బింగ్ చెప్పారు.
అపరిచితుడు, ఐ:
విక్రమ్ కి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా అపరిచితుడు. ఈ సినిమాలో విక్రమ్ మూడు పాత్రలకి మూడు వేరియేషన్స్ చూపిస్తూ చూపిస్తూ డబ్బింగ్ చెప్పారు. అలాగే విక్రమ్ నటించిన ఐ సినిమాకు కూడా డబ్బింగ్ చెప్పారు.
తెగింపు:
తమిళ స్టార్ హీరో అజిత్ తెలుగు సినిమాలన్నిటికీ శ్రీనివాస మూర్తే డబ్బింగ్ చెప్పారు. ఇటీవల వచ్చిన తెగింపు చిత్రానికి కూడా ఆయనే డబ్బింగ్ చెప్పారు.
జనతా గ్యారేజ్:
తారక్ హీరోగా వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కు బాబాయి పాత్రలో నటించిన మలయాళ నటుడు మోహన్ లాల్ పాత్రకి శ్రీనివాస్ డబ్బింగ్ చెప్పారు.
అల వైకుంఠపురం:
త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన అల వైకుంఠపురం సినిమాలో కీలకపాత్ర పోషించిన నటుడు జయరాం పాత్రకి శ్రీనివాస్ డబ్బింగ్ చెప్పారు.
గరుడవేగా:
సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన గరుడ వేగా చిత్రం లో రాజశేఖర్ పాత్రకి శ్రీనివాస్ డబ్బింగ్ చెప్పారు.
ఐరన్ మాన్, జేమ్స్ బాండ్:
హాలీవుడ్ సినిమాలైన ఐరన్ మాన్, జేమ్స్ బాండ్ కూడా శ్రీనివాస్ డబ్బింగ్ చెప్పారు.
సఖి:
మాధవన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మాధవన్ పాత్రకి శ్రీనివాస మూర్తి డబ్బింగ్ చెప్పారు.
హనుమాన్:
తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం హనుమాన్. ఈ పాన్ ఇండియా సినిమా ట్రైలర్ కూడా శ్రీనివాస్ డబ్బింగ్ చెప్పారు.
ఇవే కాకుండా బాలీవుడ్ హీరోలు షారూఖ్ ఖాన్, హృతిక్ రోషన్‌ల పాత్రలకు సైతం శ్రీనివాసమూర్తి డబ్బింగ్ చెప్పారు.