Sree Leela: దేవత లా ఉన్న శ్రీలీల .. కుర్రాళ్ళు చూస్తే వెంటనే ఫోన్ వాల్ పేపర్ పెట్టేసుకుంటారు !

Sree Leela: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో శ్రీ లీల తెలుగు పరిచయమైంది.. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయింది.. శ్రీ లీల తన గ్లామర్, డ్యాన్స్, గ్రేస్ తో సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ క్రేజ్ అందుకుంది.. ఆ తరువాత మాస్ మహారాజా రవితేజ సినిమాలో నటించి బ్లాక్ బ్లాస్టర్ హిట్ అందుకుంది సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు గా ఉంటుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Sree Leela gorgeous look saree photos
Sree Leela gorgeous look saree photos

 

శ్రీ లీల చేసింది రెండు సినిమాలే.. చేతిలో అరడజను కు పైగా ఆఫర్స్ ఉన్నాయి.. అంతేకాదండోయ్.. అమ్మడు మాస్ మహారాజా రవితేజ ధమాకా సినిమాలో నటించడం.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తోపాటు రవితేజ కెరీర్ లోనే ఫస్ట్ టైం 100 కోట్ల సినిమాగా రికార్డులు ఎక్కడంతో.. శ్రీ లీల పేరు మారుమోగిపోతుంది. శ్రీల టాలీవుడ్ బాక్సాఫీస్ దేవత అంటూ పొగిడేస్తున్నారు..

 

సోషల్ మీడియాలోనూ శ్రీ లీల తన క్రేజ్ పెంచుకుంటుంది. యూత్ ను ఇంటర్నెట్ ఫాన్స్ ను కట్టిపడేందుకు నెట్టింట రచ్చ చేస్తుంది.. గ్లామర్ మెరుపులతో కుర్రగుండల్ని కొల్లగొడుతుంది. వరుస ఫోటో షూట్లతో మెస్మరైజ్ చేస్తోంది. శ్రీ లీల సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలలో స్టన్నింగ్ లుక్స్ తో చూపు తిప్పుకొనివ్వదు ఈ బ్యూటీ.. తాజాగా అచ్చ తెలుగు అమ్మాయిల పట్టు చీరలో కనిపించింది..

 

నాచురల్ బ్యూటీ శ్రీ లీల సంప్రదాయ చీరకట్టులో కనిపించేసరికి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. గోల్డ్ కలర్ శారీలో యువరాణిలా మెరిసిపోతున్న అంటూ పచ్చ చీరలో ప్రకృతి తలపిస్తుందంటూ.. శ్రీ లీలపై కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.. ఇక ఆమె ఫ్యాన్స్ అయితే ఏకంగా ఈ ఫోటోలను స్క్రీన్ వాల్ పేపర్ గా పెట్టుకున్నా స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు శ్రీ లీల క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది..