Raviteja: ప్రభాస్ కూడా కుళ్ళిపోయేలా .. ధమాక, వాల్తేరు తరవాత రవితేజ ఆస్తి ఎంత పెరిగిందో తెలుసా ! 

Raviteja: సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వయం శక్తితో ఎదిగిన హీరోలలో రవితేజ కూడా ఒకరు.. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శనీయం.. రవితేజ ఎంతో కష్టపడి తనను తాను మలుచుకొని ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు.. 365 రోజులు రవితేజ ఎక్సర్సైజులు చేస్తూనే ఉంటాడు.. సినీ కెరియర్లో పడి లేచిన కెరటం రవితేజ.. ఆయన ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసా.!? ప్రభాస్ ను ధాటేశాడా.!?

Raviteja property value to beat prabahs
Raviteja property value to beat prabahs

రవితేజ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చూస్తూనే ఉంటాడు. సినిమా హిట్ అయినప్పుడు గర్వపడడు. అలానే ఫ్లాప్ అయినా కూడా బాధపడడు. ఎప్పుడూ తటస్థ వైఖరితో ముందుకెళ్తాడు రవితేజ.. ఆ ఆలోచన తీరుతోనే సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు.. కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టుకున్నాడు. హైదరాబాదులో త్రీ బ్రెడ్ రూమ్ ఫ్లాట్ ఉంటే చాలు అనుకొని ఇండస్ట్రీలోకి వచ్చాడట రవితేజ. ఆ తర్వాత వచ్చిందంట బోనస్ అని నాతో చెప్పారని కమలహాసన్ ఇటీవల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అటువంటి రవితేజ ఈరోజు 12 కోట్లు ఖరీదు చేసే ఇంట్లో ఉంటున్నాడు.

 

రవితేజ ఇల్లు ఒక్కటే 12 కోట్లు అంటే ఆయనకు ఉన్న కార్లు, బంగ్లాలు, మిగతా అపార్ట్మెంట్స్ ఇంకెన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయో మనం సులువుగా అంచనా వేసుకోవచ్చు. రవితేజ సినిమాలు వరుస హిట్లు అందుకున్నాయి రవితేజ కెరియర్లో ధమాకా సినిమా మొట్టమొదటిసారిగా బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది .

రవితేజ కెరియర్ గ్రాఫ్ లో అమాంతం పెంచేసింది .అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కీలకపాత్రలో కనిపించారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ రెండు సినిమాలతో వచ్చిన రెమ్యూనరేషన్తో రవితేజ మరో విలువైన ప్రాపర్టీని కొనుగోలు చేశాడని.. దాంతో ప్రభాస్ అస్తుల విలువను రవితేజ బీట్ చేసినట్లు తెలుస్తోంది. రవితేజ ఇప్పటి వరకు ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో రానున్న సినిమాలో రవితేజ కీలక పాత్ర పోషించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.