Trivikram-Mahesh Babu : త్రివిక్రమ్ సినిమాలో మహేష్ బాబు అక్కగా సింగర్ సునీత ?

Trivikram-Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.. మొన్నటికి మొన్న పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన.. ఇప్పుడు మరొకసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అవకాశం ఇచ్చారు. ఇక ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న #SSMB28 ( వర్కింగ్ టైటిల్) సినిమాకు సంబంధించి కథ కూడా సిద్ధం అయ్యింది. అంతేకాదు మహేష్ బాబుకు సంబంధించిన మొదటి షెడ్యూల్ లో భాగంగా యాక్షన్ సన్నివేశాలను కూడా పూర్తి చేశారు. ఇక త్వరలోనే రెండవ షెడ్యూల్ కూడా మొదలుపెట్టబోతున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక రెండవ షెడ్యూల్ కి సంబంధించి పూజా హెగ్డే – మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

Singer Sunita as Mahesh Babu's sister in Trivikram movie
Singer Sunita as Mahesh Babu’s sister in Trivikram movie

ఇక మరొక వైపు మిగతా నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాలో మహేష్ బాబు అక్క పాత్ర చాలా కీలకమైనదట. ఇక పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో.. సీనియర్ హీరోయిన్లను, సీనియర్ నటీనటులను లేదా సీనియర్స్ సెలబ్రిటీలను తమ సినిమాలలో పెట్టుకునే అలవాటున్న త్రివిక్రమ్ శ్రీనివాస్..ఈసారి ప్రముఖ గాయకురాలు సునీతను మహేష్ బాబుకు అక్క పాత్రలో తీసుకోవడానికి అప్రోచ్ అయ్యారట. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతలు సింగర్స్ సునీతను కలిసినట్టు సమాచారం.

ఇదిలా వుండగా.. ఇప్పటికే మలయాళంలో మంచి ఫీల్ గుడ్ సినిమాలో మలయాళం హీరో పృథ్వీరాజ్ పక్కన హీరోయిన్ గా సునీత కు నటించే అవకాశం వచ్చినా సున్నితంగా రిజెక్ట్ చేసింది. మరి ఈ సినిమాలో మహేష్ కి అక్కగా నటించడానికి అవకాశం వచ్చింది. సాధారణంగా మహేష్ బాబు సినిమాలో అవకాశాన్ని వదులుకోవడానికి ఎవరు ఇష్టపడరు. మరి ఈ అవకాశాన్ని సునీత సద్వినియోగం చేసుకుంటుందో లేదో ఇంకా అధికారిక ప్రకటన వెలువడే వరకు ఎదురు చూడాల్సిందే. కానీ ఇదే నిజమైతే అభిమానులకు పండగే.. ఇక మహేష్ బాబు సినిమాలో సునీత నటిస్తే సినిమాకి కూడా ప్లస్ అవుతుందని త్రివిక్రమ్ భావించినట్లు తెలుస్తోంది. మరి అసలు విషయం తెలిసే వరకు కొద్ది రోజులు ఆగాల్సిందే.