Bigg Boss 6 Telugu : బాలాదిత్య ఊర మాస్ యాంగిల్ ఇది .. దెబ్బకి గీతూ నోరు మూసుకుంది

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్  షోలో ప్రతిసారి మిగిలిన కంటెస్టెంట్స్ ఎలా ఉన్నా.. ఒక్కడు మాత్రం చాలా మంచోడు వస్తాడు. రేలంగి మావయ్యకే మంచి చెప్పేలా ఉంటాడు అతడు. ఈసారి కూడా అలాంటి కంటెస్టెంట్ ఒకడు వచ్చాడు. అతను ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. బాలాదిత్య. నీ పనికిమాలిన ఆట తీరుతో.. నువ్వు చెడిపోవడం కాకుండా ఇంటిని కూడా చెడగొడుతున్నావ్.. వాళ్లను కూడా ఆడనివ్వడం లేదు అంటూ ఈ మధ్య నాగార్జున ఓసారి బాలాదిత్యపై ఓ రేంజ్ లో సీరియస్ అయ్యాడు. ఆ తర్వాత కూడా ఈయన ఆటతీరులో ఎలాంటి మార్పు రాలేదు. కానీ షో మొదలైన తర్వాత తొలిసారి ఈయనకు కోపం వచ్చింది. రేలంగి మావయ్య ముసుగు తీసి బయటకు వచ్చి గలాట గీతూపై రెచ్చిపోయాడు. బాల అంత సీరియస్ అవ్వడం చూసి ఇంటి సభ్యులు కూడా షాక్ అయ్యారు.. అదే విధంగా ఆనందపడ్డారు కూడా.

మంచోడు మంచోడు అనిపించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఏదో ఓ రోజు కచ్చితంగా మంచి మనల్ని ముంచేస్తుంది. ఈ విషయం అర్థం అవడానికి కూడా ఎన్నో రోజులు పట్టదు. బిగ్ బాస్ 6 తెలుగు మొదలయి నెల రోజులు అవుతున్న కూడా బాలాదిత్య ఇప్పటికీ ఒక ముసుగు వేసుకొని ఉన్నాడు. శాంతమూర్తిలా మాట్లాడుతూ అందరితో మంచిగా ఉంటూ ఒక్కరిపై కూడా కోపం ప్రదర్శించకుండా.. ఇన్ని రోజులు కవర్ చేసుకుంటూ వచ్చాడు. అదేంటని అడిగిన నాగార్జునకు కూడా.. తాను ఇంతే అంటూ సమాధానం ఇచ్చాడు. తనకు కోపం వస్తుంది కానీ.. అస్తమానం రాదు.. అలా వచ్చే మూమెంట్ వచ్చినప్పుడు మాత్రం కచ్చితంగా అది చూపిస్తాను.. ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుంది అంటూ ఆ మధ్య నాగార్జునతో చెప్పాడు బాలాదిత్య.

Bigg Boss 6 Telugu baladitya full mass angle
Bigg Boss 6 Telugu baladitya full mass angle

Bigg Boss 6 Telugu : ఇది కదా మాకు కావాల్సింది..!

ఆ మూమెంట్ రానే వచ్చింది. ఈ వారం టాస్క్ లో భాగంగా గీతుపై అరిచేసాడు బాలాదిత్య. తాను ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు.. వినకుండా గీతూ మధ్యలో ఏదో కామెడీ చేయడంతో.. దేనికైనా లిమిట్ ఉంటుంది.. ఇది తప్పు.. ఇంక నువ్వు ఆపు.. ఆపుతావా లేదా అంటూ ఆ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. బాలాలో ఈ కోపం చూసి ఇంతకాలం దీన్ని ఎక్కడ దాచి పెట్టావు.. ఇది కదా మాకు కావాల్సిన మాస్ యాంగిల్ అంటున్నారు ఆడియన్స్. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు ఒకసారి సీరియస్ అయితే ఇల్లు మొత్తం సీరియస్ అయిపోయింది. మొత్తానికి బాలాదిత్యకు ఒక్కసారి కూడా కోపం రాదు అనుకుంటే.. గీతూ దెబ్బకు ఆ కోపం కాస్తా కట్టలు తెచ్చుకుంది. రాబోయే రోజుల్లో కూడా ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా లేదా చూడాలి.