Sharwanand : టాలీవుడ్ హీరో శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తరువాత కృష్ణ చైతన్య దర్శకత్వంలో శర్వానంద్ సినిమా చేయబోతున్నాడని తెలిసిందే.. శర్వానంద్ తో కృష్ణ చైతన్య సినిమా ఓపెనింగ్ కూడా పూర్తయింది. ఈ సినిమాలో రాసి కన్నాను హీరోయిన్ గా తీసుకున్నారు.. అయితే ఈ ప్రాజెక్టు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..
కృష్ణ చైతన్య ఈ సినిమాని ముందుగా ఓ నిర్మాణ సంస్థతో చేయాలని అనుకున్నారట.. అయితే అప్పుడు అది వర్కౌట్ కాలేదట. దాంతో కృష్ణ చైతన్య శర్వానంద్ కాంబినేషన్లో వస్తున్న సినిమాని పీపుల్ మీడియా సంస్థతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే.. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ లో చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
శర్వానంద్, కృష్ణ చైతన్య ఎన్ని రోజులుగా ట్రై చేసినా సితార ఎంటర్టైన్మెంట్స్ అపాయింట్మెంట్ దొరకలేదట. అలాంటిది శర్వానంద్ రక్షిత ఎంగేజ్మెంట్ అయినా రెండు రోజుల్లోనే.. సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఫోన్ చేసి ముందుగా మీరు శర్వానంద్ తో తీస్తానన్న సినిమాను సితార బ్యానర్స్ పై తీయడానికి ఒప్పుకున్నట్లుగా ఓ అగ్రిమెంట్ కూడా పంపించారట. ఇదంతా శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి రక్షిత అదృష్టం వలనే కలిగిందని వాళ్ళు భావిస్తున్నారు.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని నింపుతుంది. ముఖ్యంగా అబ్బాయిల జీవితాన్ని మార్చేసేది మాత్రం అమ్మాయిలే అని చెప్పాలి .. శర్వానంద్ కొత్త జీవితంలోకి ఎంటర్ అవుబోతుండగా ఎంగేజ్మెంట్ అయినా కొద్ది రోజుల్లోనే సితార బ్యానర్ పై సినిమా చేయడం నిజంగానే లక్ అని చెప్పల. ఎందుకంటే ఈ బ్యానర్ పై ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హీట్ అయ్యాయి. కోట్లకు కోట్లకు పైగా లాభాలను తీసుకువచ్చాయి. రక్షితతో ఎంగేజ్మెంట్ అయిన వారం తిరగకుండానే శర్వానంద్ కి కోట్లు కలిసే కలిసి వచ్చే అదృష్టం వచ్చిందని వారి సన్నిహితులు చెప్పుకుంటున్నారు.