Pawan Kalyan : పవర్ స్టార్ బైక్ ఫోటోలు వైరల్.. ఇంతకీ ఆ బైక్ ఖరీదు తెలిస్తే నోరెళ్ళ బెడతారు.!

Pawan Kalyan :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆయన మేనరిజం దగ్గర నుంచి డైలాగ్స్ వరకు ప్రతి ఒక్కటి ప్రత్యేకమే.. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బైక్ నడుపుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇంతకీ ఈ బైక్ ఖరీదు ఎంతో తెలిస్తే నోరేళ్ల బెట్టాల్సిందే..!

pavan-kalyan-bmw-r1250-gs-bike-pics-viral-on-social-media
pavan-kalyan-bmw-r1250-gs-bike-pics-viral-on-social-media

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి బైక్స్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరముల్లు షూటింగ్ లో పాల్గొని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సరదాగా కాసేపు సెట్స్ లో బైక్ వేసుకొని తిరిగారు. ఈ సమయంలో కొన్ని ఫోన్స్ క్లిక్ అనడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. బ్లాక్ టీ షర్ట్ లో బైక్ నడుపుతున్న ఫోటో ఒకటి. హరిహర వీరముల్లు గెటప్ వేసుకుని రెడ్ డ్రెస్ లో ఉన్న ఫోటో ఒకటి వైరల్ అవుతున్నాయి. పవన్ నడుపుతున్నది BMW R1250 GS మోడల్ కు చెందిన బైక్.. ఈ బైక్ ధర అక్షరాల 24 లక్షలు.. ఈ రేటు తెలియగానే అందరూ నోరెళ్ళ బెడుతున్నారు.

పవన్ కళ్యాణ్ కి బైక్స్ అన్నా గన్స్ అన్నా చాలా ఇష్టమని ఆయన సినిమాలు చూసే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. హరిహర వీరముల్లు సినిమా ప్రస్తుతం ఇంటర్వెల్ సీన్ షూటింగ్ జరుపుకుంటుంది. ఫ్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ కార్డు పడే వరకు పవన్ కళ్యాణ్ కెరియర్ లో బెస్ట్ ఎపిసోడ్ గా క్రిష్ దీన్ని రూపొందిస్తున్నారట. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ కి మైల్ స్టోన్ అవుతుందో లేదో చూడాలి.