Kantara : అంత హిట్ కొట్టిన కాంతారకి ఇప్పుడు నెగెటివ్ టాక్ న‌డుస్తుందేంటి.. ఎక్క‌డ బెడిసి కొట్టింద‌బ్బా..!

Kantara : కేజీఎఫ్ ఫ్రాంచైజీలో వ‌చ్చిన చిత్రాల త‌ర్వాత దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన చిత్రం కాంతార‌. రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన ఈ కన్నడ సినిమా కన్నడలో కంటే తెలుగులో మంచి వసూళ్లను రాబట్ట‌డం విశేషం. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అక్టోబర్ 15వ తేదీన విడుదల చేయ‌గా, ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో హీరో హీరోయిన్లతో సహా ఎవరూ తెలుగు ఆడియన్స్ కి పెద్దగా తెలియ‌క‌పోయిన కంటెంట్ బాగుండ‌డంతో థియేటర్స్‌కి క్యూ క‌ట్టారు. ఈ క్ర‌మంలో భారీ వ‌సూళ్లే రాబ‌ట్టింది కాంతార‌.

kantara-gets-negative-comments
kantara-gets-negative-comments

నెగెటివ్ కామెంట్స్..

ఇక అది అలా ఉంటే ఈ సినిమాను థియేటర్స్‌లో చూడని ప్రేక్షకులు తాజాగా ఓటీటీలో చూసి అసలు ఏముంది రా బాబు.. ఈ సినిమాలో అంటూ ఇంత పెద్ద హిట్ అయ్యిందని పెద‌వి విరుస్తున్నారు. కేవలం క్లైమాక్స్ ఒక్కటే సినిమాకి ఆయువుపట్టు అని , మిగతా సినిమా అంతా ఇదివరకే చూసిన సినిమాల మాదిరిగా ఉంద‌ని అంటున్నారు. కొంద‌రైతే తెలుగులో రంగస్థలం సినిమా లైన్ నే కాంతార సినిమాని కంటిన్యూ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. అంతేగాక.. సాంగ్స్ పరంగా ఓకే అనుకున్నా, కథా కథనాలు కొత్తగా లేవని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

వరాహ రూపం సాంగ్, భూతకోల సంప్రదాయం, క్లైమాక్స్ మినహాయిస్తే సినిమాని ఈజీగా పక్కన పెట్టేయొచ్చని బాహాటంగా చెబుతున్నారు. థియేట‌ర్స్‌లో మ‌న‌కు వ‌రాహ‌రూపం క‌నిపించింది. ఇప్పుడు ఓటీటీకి వ‌చ్చే స‌రికి అది కూడా లేదు. దీంతో సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు ఏమి లేవ‌ని చెబుతున్నారు. కాంతార‌ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు దక్కించుకోగా, ఈ సినిమా నవంబర్ 24 నుంచి తెలుగుతోపాటు కన్నడ, తమిళ, మలయాళీ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా ను థియేటర్స్‌లో చూడని ప్రేక్షకులు తమ ఇంట్లో చూస్తూ కొందరు ఎంజాయ్ చేస్తుంటే మ‌రి కొంద‌రు ఏమంత బాలేద‌ని నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ.. ఇప్పుడేం లాభం ఆల్రెడీ సినిమా బడ్జెట్ కి 25 ఇంతలు ఎక్కువే క‌లెక్ష‌న్స్ రాబట్టుకుంది.