Daily Astrology : నేటి రాశి ఫలాలు..02 డిసెంబర్ 2022 శుక్రవారం రాశి ఫలాలు..!

Daily Astrology : మేషం:
వ్యాపార ఉద్యోగాలు నత్త నడకన సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

Advertisement
Today horoscope..02-12-2022 Friday horoscope..!
Today horoscope..02-12-2022 Friday horoscope..!

వృషభం:
ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.

Advertisement

మిధునం:
చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలను నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సంతాన విద్య విషయాలు అనుకూలిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగించవచ్చు.

కర్కాటకం:
వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణము ఉంటుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

సింహం:
చేపట్టిన పనులను శ్రమాధిక్యం. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. సోదరులతో కలహా సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార ఉద్యోగాలలో కొంత గందరగోల వాతావరణం ఏర్పడనుంది.

కన్య:
స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.

తుల:
వ్యాపారాలు ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం:
బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. వ్యయ ప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది తప్పదు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

ధనస్సు:
దూర బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

మకరం:
వ్యాపారాలు ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది..గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

కుంభం:
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటు చేసుకుంటాయి.వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి.

మీనం:
చేపట్టిన పనులను మరింత ఉత్సాహంగా పూర్తి చేస్తారు. అప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.

Advertisement