HIT 2 Review : హిట్ 2 మూవీ రివ్యూ

HIT 2 Review:  నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం హిట్: ది సెకండ్ కేస్ నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే . శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా హిట్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందింది. మొదటి పార్ట్‌లో విశ్వక్ సేన్ నటించగా.. సీక్వెల్‌లో అడివి శేష్ నటించారు. మంచి అంచనాల నడుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన‌ హిట్ 2 అసలు ఎలా ఉంది.. కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏమాత్రం తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంది అనేది చూద్దాం.

hit-2-movie review
hit-2-movie review

కథ

సంజన అనే ఒక యువ‌తి హ‌త్య‌కు గురవుతుంది. ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అడివి శేష్ రంగంలోకి దిగి దానిని సాల్వ్ చేసే ప్ర‌య‌త్నం చేస్తాడు.. సంజనను హత్య చేసిన వ్యక్తిని పట్టుకోవడం తనకు చాలా సులభం అని మొదట అడివి శేష్ భావించిన రాను రాను అది చాలా ట‌ఫ్‌గా ఉంటుంది. కిల్లర్ అడివి శేష్ కి అడుగడున సవాల్ విసురుతూనే ఉంటాడు. సంజన డెడ్ బాడీ కొందరు అమ్మాయిల శరీర భాగాల సమాహారం అని తెలుసుకొని కేడీ పాత్ర పోషిస్తున్న అడివి శేష్ నివ్వెర పోతారు. అసలు ఎవరీ సీరియల్ కిల్లర్? అమ్మాయిలను ఎందుకు చంపుతున్నాడు? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

పర్‌ఫార్మెన్స్

క‌థ‌లో చిన్న చిన్న లోపాలున్న‌ప్ప‌టికీ ఇంటెన్స్ యాక్టింగ్‌తో అడ‌విశేష్ వాటిని క‌నిపించ‌కుండా అద్భుతంగా న‌టించాడు. మీనాక్షి మంచి ఆర్టిస్ట్ అయిన‌ప్ప‌టికీ ఆమెకు పెద్ద స్కోప్ ద‌క్క‌లేదు. రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, కోమలి ప్రసాద్, శ్రీనాథ్ మాగంటి, శ్రీకాంత్ అయ్యంగార్ ఇలా వారి వారి పాత్ర‌ల‌లో అద్భుతంగా న‌టించారు.

టెక్నిక‌ల్ విష‌యానికి వ‌స్తే.. ద‌ర్శకుడు శైలేష్‌ సినిమాని అద్భుతంగానే తెర‌కెక్కించాడు. అసలు కథ, ట్విస్ట్స్ సెకండ్ హాఫ్ లో క‌నిపిస్తుంది.. ఫస్ట్ హాఫ్ కి మించిన విష‌యం సెకండ్ హాఫ్ ఉంది. కథలో భాగంగా వచ్చే మలుపులు ఎంత‌గానో అలరిస్తాయి. విలన్ ఎవరు? అతడు అమ్మాయిలను చంపడం వెనుక కారణం ఏమిటనేది? ఆడియన్స్ కి చెప్పుకోదగ్గ అనుభూతి పంచుతుంది. ఎస్.మణికందన్ తన విజువల్స్‌తో ఎంత‌గానో ఆకట్టుకున్నాడు. సంగీతం ప‌ర్వ‌లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

ప్లస్ పాయింట్లు:

ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు
ఇంటెన్సిటీ
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్లు:

స్లో నేరేషన్
ఎమోషన్ పెద్ద‌గా లేకపోవడం

చివ‌రిగా..

ఊహించని ట్విస్ట్స్, చక్కని స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ శైలేష్ కొలను ఓ పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ అందించారనే చెప్పాలి. ఈ సినిమాతో అడివి శేష్ త‌న ఖాతాలో మరో హిట్ వేసుకున్నాడు.. హీరో నాని కూడా నిర్మాతగా సక్సెస్ అయినట్లే. మరి కమర్షియల్ గా హిట్ 2 ఏ స్థాయి విజయం సాధిస్తుందో అనేది రానున్న రోజుల‌లో తెలియ‌నుంది.

రేటింగ్‌: 2.75/5