Prabhas : ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ లో ఈ పాయింట్ గమనించారా ? ఈ దెబ్బతో బాహుబలి ఔట్ !!

Prabhas : బాలీవుడ్ డైరెక్టర్ హోమ్ రౌత్ దర్శకత్వంలో రామాయణ ఇతిహాస కథగా తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమా.. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సినిమా కోసం యావత్ దేశం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను ఇటీవల అయోధ్యలోని రామ్ లీలా ప్రాంగణంలో భారీ స్టేజ్ ఏర్పాటు చేసి ఈవెంట్ నిర్వహించారు. అక్కడ ఆది పురుష్ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయడం జరిగింది. టీజర్ ప్రసారమవుతున్నంత సేపు రామ్ లీలా ప్రాంగణం.. అభిమానుల కోలాహాలు, ఈలలు, చప్పట్లతో మారుమ్రోగిపోయింది. ముఖ్యంగా ఈ టీజర్ లో రాముడిగా ప్రభాస్ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటున్నారు.

ఈ టీజర్ లో ఈ పాయింట్ గనుక గమనించినట్లయితే ఈ సినిమా బాహుబలిని సైతం మించిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా 3D లో తెరకెక్కిస్తున్నారు. ఇక అందుకే చిన్న పిల్లలకు కూడా ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఇక బాహుబలి సినిమా చిన్నపిల్లలకు పెద్దగా కనెక్ట్ అవ్వలేదు.. కానీ ఆది పురుష్ సినిమా చిన్నపిల్లలతో పాటు.. ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవ్వడం ప్లస్ పాయింట్ గా మారింది. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ లో ఈ సినిమాకు విపరీతంగా క్రేజ్ లభించే అవకాశం కూడా ఎక్కువ ఉంది. 2023 జనవరి 12 న సంక్రాంతి పండుగకు సినిమాను విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు . కాబట్టి ఎలాగో సంక్రాంతి హాలిడేస్ చిన్నపిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇక ఇదే ఈ సినిమాకు బాహుబలి కంటే ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

Did you notice this point in Prabhas Adipurush Teaser 
Did you notice this point in Prabhas Adipurush Teaser

ఇప్పటివరకు పాన్ ఇండియా స్థాయిలో బాహుబలి సినిమా అరుదైన రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ సినిమా రికార్డులను ఏ ఒక్క సినిమా కూడా బ్రేక్ చేయలేదు కానీ ఆది పురుష్ సినిమా ఖచ్చితంగా బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందని ప్రతి ఒక్కరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆది పురుష్ దెబ్బకు బాహుబలి కూడా ఔట్ అవ్వాల్సిందే.. ఇక ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణ్ గా సైఫ్ అలీ ఖాన్, హనుమంతుడిగా దేవదత్త గేన్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు ప్రేక్షకులకు మంచి విజువల్ ట్రీట్ అందించాడని చెప్పవచ్చు. డైలాగ్స్, గ్రాఫిక్స్ , రాక్షసులను డిజైన్ చేసిన తీరు ప్రతి ఒక్కటి కూడా ప్రేక్షకులను, ముఖ్యంగా చిన్నపిల్లలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక కచ్చితంగా ఈ సినిమా ఊహించిన దానికంటే డబుల్ బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు.