Anasuya : ఇప్పుడే అందిన లేటెస్ట్ న్యూస్.. బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా యాంకర్ అనసూయ !

Anasuya : డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అలాగే స్టార్ మా చానల్స్ లో బిగ్ బాస్ ఆరవ సీజన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరవ సీజన్ నుంచి ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. త్వరలోనే ఏడవ వారం కూడా ఎవరో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. హౌస్ లో కంటెస్టెంట్లు కూడా తగ్గుతున్న నేపథ్యంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇద్దరు కంటెస్టెంట్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వహకులు.. ఈ నేపథ్యంలోనే బాగా పాపులారిటీ ఉన్న వారిని తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా యాంకర్ అనసూయ ను బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకొస్తున్నారనే వార్త బాగా ప్రచారం అవుతోంది.

అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ అనసూయ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ వార్తలు బాగా వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం అనసూయ పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప లో దాక్షాయిణిగా లేడీ విలన్ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను మెప్పించిన అనసూయ అంతకుముందే ఎన్నో పాత్రలకు పెట్టింది పేరుగా నటించింది . రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న అనసూయ.. ఆ తర్వాత వచ్చిన లేడీ ఓరియంటెడ్ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తాను నటించే ప్రతి సినిమాలో కూడా తన మార్కు చూపించే ప్రయత్నం చేస్తోంది.

Breaking news Anasuya entry by wild card to Bigg Boss 6 Telugu
Breaking news Anasuya entry by wild card to Bigg Boss 6 Telugu

అందుకే సినీ ఇండస్ట్రీలో విపరీతమైన అభిమానులు కూడా ఉన్నారు . ఒకవైపు జబర్దస్త్ ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ అక్కడ పరిస్థితులు ప్రస్తుతం ఆమెకు అనుకూలించని నేపథ్యంలో స్టార్ మా చానల్లో అవకాశం రావడంతో అదే అదునుగా తీసుకొని జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసింది. ఇక ప్రస్తుతం బుల్లితెరకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి.. అటు సినిమాలు ఇటు వెబ్ సిరీస్ ల పైన బాగా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది.