Anchor Reshmi బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా పరిచయమైంది రష్మి. ఈ షో తో మంచి గుర్తింపును తెచ్చుకుంది. జబర్దస్త్ కి యాంకర్ గా రాకముందు పలు సినిమాలలో నటించినా రాని గుర్తింపు జబర్దస్త్ షో తో వచ్చింది.. ఇక సుధీర్ రష్మీ లవ్ ట్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రష్మీ గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.
యాంకర్ రష్మి యానిమల్ లవర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది రష్మి. ఆమె జంతువుల విషయంలో సీరియస్ గా స్పందించడంతోపాటు జంతువులను హింసించే ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ అవుతుంది.. మూగజీవాలను హింసించద్దంటు అందర్నీ కోరుతుంది.. అయితే తాజాగా ఆమె మరోసారి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తాజాగా బుల్ ఫైట్ కి సంబంధించిన ట్వీట్ చేస్తూ ఇలాంటి వీడియోలు చూసి రాత్రి ఎలా నిద్రపోతారు అంటూ ట్వీట్ చేసింది . దానికి ఓ నెటిజన్ స్పందిస్తూ మరీ మీరు లెదర్ తో తయారు చేసిన వస్తువులను ఇండస్ట్రీలో ఎలా వాడుతారు అంటూ ప్రశ్నించాడు.. అందుకు సమాధానం గా రష్మీ కూడా ఓపిగ్గా చెప్పింది..
నేను ఎలాంటి లెదర్ వస్తువులను వాడను.. నేను హిందువును.. అలాంటి పనులు అస్సలు చేయను.. వినియోగదారులు అధికంగా వాడే ఏ వస్తువును కూడా బ్యాన్ చేయలేరు .. కాబట్టి అలాంటి వస్తువులను కొనక పోవడమే మంచిది అంటూ.. రష్మీ వివరణ ఇస్తూ మరో ట్వీట్ చేయగా .. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.