Health Benefits : ఈ టీ తో అనారోగ్య సమస్యలే కాదు జుట్టు సమస్యలు కూడా పరార్..!!

Health Benefits ; ఈ రోజుల్లో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉబకాయ సమస్యతో బాధపడుతున్నారు. మనకున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల బరువు పెరగటం అనేది సునాయాసంగా జరిగిపోతుంది. బరువు పెరగడం అనేది పేపర్ పై పేపర్ అని రాసినంత ఈజీ.. కానీ బరువు తగ్గడం అనేది నీటి పై నీరు అని రాసినంత కష్టం.బరువు తగ్గడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది . కొంతమంది కి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం పెద్దగా కనబడదు. ఇలాంటి ఉబకాయం తగ్గించడానికి మందార ఆకు రసం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మంచి ఫలితాన్ని ఇస్తుందని వైద్యనిపుణులు పరిశోధించి మరీ నిరూపించారు. అధిక బరువు తగ్గించడంలో మందార ఆకులతో చేసే టీ చాలా బాగా ఉపయోగపడుతుంది.

దీనినే “హీరోయిన్ బ్యూటీ సీక్రెట్ టీ” అని కూడా అంటారు.దీనికి ముందుగా మందార ఆకులను కోసుకొని శుభ్రంగా కడిగి .. ఒక గిన్నెలో వేసి గ్లాసు నీళ్లు పోయాలి. దీనికి తోడుగా దాల్చిన చెక్క పొడిని కలిపి మరిగించి వడగట్టి తేనె కలిపి తీసుకోవాలి. దాల్చిన చెక్క పొడి సువాసనకే కాక అధిక బరువు తగ్గడంలోనూ చాలాబాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే కాఫీ, టీ లకు బదులుగా మందారమాకు టీని తీసుకుంటే శరీరంలో ఉన్న చెడు కొవ్వు కరిగిపోతుంది. అలాగే అలసట, నీరసం, చికాకు, నిస్సత్తువ అన్నీ తొలగిపోయి వెంటనే శక్తి లభిస్తుంది.  మందార ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మందార ఆకు టీ LDL చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

Health Benefits of drinking hibiscus leaves Tea
Health Benefits of drinking hibiscus leaves Tea

ఇది ధమనుల లోపలి భాగంలో అడ్డుపొరలు ఏర్పడకుండా నివారించడంలో సహాయపడుతుంది. తద్వారా మీ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.మందారంలోని ఔషదగుణాలు జుట్టు రాలడం, చుండ్రు, దురద వంటి సమస్యలను తగ్గిస్తుంది.  అలానే ఇది శరీరంలోని అధిక వేడిని కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది.రక్త నాళాల ద్వారా రక్త ప్రవాహం బాగా జరిగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. రైనీ సీజన్ లో వచ్చే జలుబు మరియు దగ్గును కూడా మందార ఆకులు నివారిస్తుంది. మందార ఆకులలో అనేక యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. క్యాన్సర్ కారకమైన ఫ్రీ రాడికల్స్ శరీరం నుండి తొలగించటానికి సహాయం చేయుట వలన క్యాన్సర్ కారకాల క్రియ మందగింపచేస్తుంది. దాదాపుగా ప్రతి ఇంటిలో మందార మొక్క ఉంటుంది. కాబట్టి మందార ఆకులను ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అధిక ఫలితాన్ని పొందవచ్చు.